వచ్చే వారం బ్యాంకులు బంద్.. ఎందుకో తెలుసా!

|

Sep 20, 2019 | 12:44 PM

మీకు బ్యాంక్ అకౌంట్ ఉందా..? డబ్బు ఏమైనా డ్రా చేద్దామని చూస్తున్నారా.? అయితే అప్రమత్తం అవ్వండి. దేశవ్యాప్తంగా ఈ నెల ఆఖరి వారంలో దాదాపు 6 రోజులు బ్యాంకులు బంద్ కానున్నాయి. దేశంలోని అన్ని రకాల బ్యాంకుల ఉద్యోగులు ఈ నెల 26, 27 తేదీల్లో సమ్మెకు పిలుపునిచ్చారు. 10 ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్-AIBOC, ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్-AIBOA, […]

వచ్చే వారం బ్యాంకులు బంద్.. ఎందుకో తెలుసా!
Follow us on

మీకు బ్యాంక్ అకౌంట్ ఉందా..? డబ్బు ఏమైనా డ్రా చేద్దామని చూస్తున్నారా.? అయితే అప్రమత్తం అవ్వండి. దేశవ్యాప్తంగా ఈ నెల ఆఖరి వారంలో దాదాపు 6 రోజులు బ్యాంకులు బంద్ కానున్నాయి. దేశంలోని అన్ని రకాల బ్యాంకుల ఉద్యోగులు ఈ నెల 26, 27 తేదీల్లో సమ్మెకు పిలుపునిచ్చారు.

10 ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్-AIBOC, ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్-AIBOA, ఇండియన్ నేషనల్ బ్యాంక్ ఆఫీసర్స్ కాంగ్రెస్-INBOC, నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ ఆఫీసర్స్-NOBO యూనియన్లు సమ్మెకు పిలుపునిచ్చాయి. ఇక ఈ రెండు రోజుల తర్వాత నాలుగో శనివారం. ఆ తర్వాత ఆదివారం. వీటికి తోడు సోమవారం అర్ధవార్షిక క్లోజింగ్ డే.. ఆ రోజున లావాదేవీలు జరగవు. ఇక ఆ వెంటనే అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా బ్యాంకులకు సెలవు. కాబట్టి బ్యాంకు లావాదేవీలు జరపాలనుకుంటే.. ముందే అప్రమత్తంగా ఉండండి. కాగా బ్యాంకుల సమ్మెపై ఇప్పటివరకు అధికారికంగా ఎటువంటి ఉత్తర్వులు రాలేదు.

బ్యాంకులు బంద్ కానున్న రోజులివే…

సెప్టెంబర్ 26, 27: బ్యాంకు ఉద్యోగుల సమ్మె

సెప్టెంబర్ 28: నాలుగో శనివారం సెలవు

సెప్టెంబర్ 29: ఆదివారం

సెప్టెంబర్ 30: అర్ధవార్షిక క్లోజింగ్ డే

అక్టోబర్ 2 – గాంధీ జయంతి