హైదరాబాద్ మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం ఉదయం ఘోరం చోటుచేసుకుంది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఆఫీస్ దగ్గర ప్రైవేట్ సెక్కూరిటీ గార్డ్ గా విధులు నిర్వహించే సెక్యూరిటీ గార్డ్ మధు దారుణానికి ఒడిగట్టాడు. తన విధుల్లో భాగంగా ఉన్న ఎస్ ఎల్ ఆర్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మధు స్వగ్రామం బత్తుల పాలెం నేరేడుచర్ల. నల్గొండ జిల్లాకు చెందిన వాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు పిల్లలతో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని గుండెలవిసేలా రోధిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న మహంకాళి స్టేషన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.