AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నవంబర్ 1 నుంచి అమలులోకి వచ్చిన కొత్త రూల్స్.. మారిన అంశాలివే..

మరో కొత్త నెల వచ్చేసింది. కొత్త నెలతో పాటు కొత్త రూల్స్ కూడా అమలులోకి వచ్చాయి. అవి చాలామందిపై నేరుగా ప్రభావం చూపనున్నాయి.

నవంబర్ 1 నుంచి అమలులోకి వచ్చిన కొత్త రూల్స్.. మారిన అంశాలివే..
Ravi Kiran
|

Updated on: Nov 01, 2020 | 11:43 AM

Share

New Changes From November: మరో కొత్త నెల వచ్చేసింది. కొత్త నెలతో పాటు కొత్త రూల్స్ కూడా అమలులోకి వచ్చాయి. అవి చాలామందిపై నేరుగా ప్రభావం చూపనున్నాయి. ఇండియన్ రైల్వేస్ టైం టేబుల్ నుంచి ఎల్పీజీ సిలిండర్ ధరల వరకు చాలా అంశాలు మారాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

  • ఎల్పీజీ సిలిండర్ ధరలు, విధానం మార్పు..

ప్రతీ నెల ప్రారంభంలో చమురు కంపెనీలు ఎల్పీజీ సిలిండర్ ధరలను మారుస్తూ వస్తాయి. దీనితో నవంబర్ 1 నుండి సిలిండర్ల ధరల్లో మార్పు ఖచ్చితంగా ఉండొచ్చు. అంతర్జాతీయ మార్కెట్లలో రేట్లను బట్టి, చమురు కంపెనీలు నవంబర్ 1 నుండి ఎల్‌పిజి సిలిండర్ ధరలను సవరించనున్నాయి.

అలాగే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల డెలివరీ విధానంలో కూడా ఈ రోజు నుంచి కొత్త మార్పులు చోటు చేసుకున్నాయి. గ్యాస్ సిలిండర్ డెలివరీ సమయంలో వినియోగదారుడి రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీతో కూడిన మెసేజ్ వస్తుంది. సిలిండర్ తీసుకొచ్చిన డెలివరీ బాయ్‌కి.. వినియోగదారుడు ఆ ఓటీపీ నెంబర్‌ను చూపించాల్సి ఉంటుంది. అలా లేనిపక్షంలో డెలివరీ సాధ్యపడదని స్పష్టం చేసింది. ఇక ఇండేన్ గ్యాస్ తన బుకింగ్ నెంబర్‌ను కూడా మార్చేసింది. ఇక నుంచి దేశవ్యాప్తంగా గ్యాస్ బుకింగ్ 7718955555 నెంబర్ నుంచి చేసుకోవాలని సూచించింది.

  • ఇండియన్ రైల్వేస్ టైం టేబుల్ మార్పు

నవంబర్ 1 నుండి దేశవ్యాప్తంగా నడుస్తున్న ట్రైన్ల టైం టేబుల్‌ను ఇండియన్ రైల్వేస్ మార్చేసింది. దీన్ని ప్రయాణీకులు గమనించాల్సి ఉంటుంది. కాగా, కొత్త సమయ పట్టిక రైల్వే శాఖ ఆర్ధిక పరిస్థితిని మెరుగుపరుస్తుందని అధికారులు భావిస్తున్నారు.

  • కేరళలో కూరగాయలకు కనీస మద్దతు ధర

కేంద్రం ఆమోదించిన రెండు వ్యవసాయ బిల్లుల నేపథ్యంలో కేరళ ప్రభుత్వం 16 రకాల కూరగాయలు, పండ్లకు కనీస మద్దతు ధర(ఎంఎస్‌పి)లను ప్రకటించింది. ఇలా కూరగాయలకు, పండ్లకు కనీస ధరలను నిర్ణయించిన మొదటి రాష్ట్రంగా కేరళ నిలిచింది. నవంబర్ 1 నుండి నూతన ధరల విధానం అమల్లోకి వచ్చింది.

  • ఢిల్లీ-చండీగఢ్ తేజస్ ట్రైన్స్

ఇవాళ్టి నుంచి ఢిల్లీ-చండీగఢ్ తేజస్ ట్రైన్స్ పట్టాలెక్కాయి. వారంలో ఐదు రోజులు(మంగళ, గురు, శుక్ర, శని,ఆదివారం) ఈ ట్రైన్స్ పరుగులు పెట్టనున్నాయి. ఆయా రోజుల్లో ఢిల్లీలో ఉదయం 9.40 గంటలకు ఈ ట్రైన్ బయల్దేరి.. మరుసటి రోజు మధ్యాహ్నం 12.40 గంటలకు చండీగఢ్ చేరుకుంటుంది.

  • రుణాలపై వడ్డీ రేట్లు తగ్గింపు

బ్యాంక్ ఆఫ్ బరోడా తన వినియోగదారులకు గుడ్ న్యూస్ అందించింది. రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించింది. ఇక ఆ రూల్ ఇవాళ్టి నుంచి అమలులోకి వచ్చింది. RLLRను 7 శాతం నుంచి 6.7 శాతానికి కోత విధించింది. దీంతో హోమ్ లోన్, వెహికల్ లోన్, ఎడ్యుకేషన్ లోన్, పర్సనల్ లోన్ కస్టమర్లకు బెనిఫిట్స్ కలగనున్నాయి.