‘ అమిత్ షా జీ ! మీకెవరిచ్చారా సమాచారం ‘ ? బంగ్లాదేశ్ ఫైర్ !

|

Dec 12, 2019 | 5:44 PM

వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లుపై అప్పుడే బంగ్లాదేశ్ నుంచి ఘాటైన రియాక్షన్ వచ్చింది. . ఈ బిల్లు నేపథ్యంలో.. అసలు రెండు రోజుల భారత పర్యటనకు రావలసిన ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్దుల్ మొమెన్ తన విజిట్ ను రద్దు చేసుకున్నారు. ఈ బిల్లు పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన ఆయన. ఇది సెక్యులర్ (లౌకిక) దేశంగా ఇండియాకు గల చారిత్రాత్మక ‘ క్యారక్టర్ ‘ ను బలహీనపరుస్తుందని విమర్శించారు. తమ దేశంలో మైనారిటీలు […]

 అమిత్ షా జీ ! మీకెవరిచ్చారా సమాచారం  ? బంగ్లాదేశ్ ఫైర్ !
Follow us on

వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లుపై అప్పుడే బంగ్లాదేశ్ నుంచి ఘాటైన రియాక్షన్ వచ్చింది. . ఈ బిల్లు నేపథ్యంలో.. అసలు రెండు రోజుల భారత పర్యటనకు రావలసిన ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్దుల్ మొమెన్ తన విజిట్ ను రద్దు చేసుకున్నారు. ఈ బిల్లు పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన ఆయన. ఇది సెక్యులర్ (లౌకిక) దేశంగా ఇండియాకు గల చారిత్రాత్మక ‘ క్యారక్టర్ ‘ ను బలహీనపరుస్తుందని విమర్శించారు. తమ దేశంలో మైనారిటీలు వేధింపులను ఎదుర్కొంటున్నారన్న ఆరోపణలను ఆయన ఖండించారు. (పౌరసత్వ సవరణ బిల్లును మొదట లోక్ సభ, ఆ తరువాత తాజాగా బుధవారం రాత్రి రాజ్యసభ ఆమోదించాయి). మా దేశంలో మైనారిటీలు అణచివేతకు గురవుతున్నారని భారత హోం మంత్రి అమిత్ షా చేసిన ఆరోపణలు సత్యదూరమని చెప్పిన మొమెన్.. ఆయనకు ఈ సమాచారం ఎవరిచ్చారని ప్రశ్నించారు. ‘ వివిధ మతాలు, వర్గాలకు చెందిన వ్యక్తుల నుంచి ఎన్నో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటున్నాం.. ఒక మతం పేరు పెట్టి ఎవరినీ వేరుగా చూడలేదు ‘ అని అన్నారు. భారత-బంగ్లాదేశ్.. దేశాలు రెండూ ప్రస్తుతం గాఢమైన మైత్రీ సంబంధాలను కొనసాగిస్తున్నాయని, ద్వైపాక్షిక సంబంధాల్లో దీన్ని ‘ గోల్డెన్ చాఫ్టర్ ‘ గా అభివర్ణిస్తారని ఆయన చెప్పారు. మా దేశ ప్రజల్లో ఎలాంటి ఆందోళననూ ఇండియా తలెత్తనివ్వదని సహజంగానే అనుకుంటామని, ఇండియాకు మా దేశం మంచి మిత్ర దేశమన్న విషయం అందరికీ తెలిసిందేనని అన్నారు.
కాగా-అస్సాంలో భారత ప్రభుత్వం చేపట్టిన ఎన్నార్సీ ఈ మైత్రీ సంబంధాలకు అవరోధంగా నిలుస్తోంది. బంగ్లా ప్రధాని షేక్ హసీనా ఆ మధ్య ప్రధాని మోదీతో సమావేశమైనప్పుడు రెండు సార్లు ఈ అంశాన్ని ప్రస్తావించారు. పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా భారత ఈశాన్య రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున నిరసనలు పెల్లుబుకుతుండడాన్ని బంగ్లాదేశ్ గమనిస్తోంది.


‘ బంగ్లా విదేశాంగమంత్రి పర్యటన రద్దుకు మరో కారణం ఉంది ‘
కాగా.. మొమెన్ వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ మరో టైపులో స్పందించారు. తమ దేశం (బంగ్లాదేశ్) లో ఇతర ఒత్తిడులు పెరిగిన కారణంగానే మొమెన్ భారత పర్యటనను రద్దు చేసుకున్నారని ఆయన మీడియాకు తెలిపారు. మొమెన్ కామెంట్స్ ని సీరియస్ గా పరిగణించాల్సిన అవసరం లేదన్నారు. హిందూ మహాసముద్రానికి సంబంధించిన అంశంపై జరిగే సదస్సుకు హాజరయ్యేందుకు, మన విదేశాంగ మంత్రి ఎస్.జయశంకర్ తో సమావేశమయ్యేందుకు మొమెన్ ఈ నెల 12.. 14 తేదీల మధ్య ఇండియాకు రావలసి ఉందని ఆయన చెప్పారు.’ నిజానికి మన దేశానికి, బంగ్లాదేశ్ కు మధ్య పటిష్టమైన సంబంధాలు ఉన్నాయి. మొమెన్ నిర్ణయం వీటిపై ఎలాంటి ప్రభావం చూపదు ‘ అని రవీష్ కుమార్ పేర్కొన్నారు. తమ దేశంలో కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలకు తాను (మొమెన్) హాజరు కావలసిఉన్న దృష్ట్యాను, తమ విదేశాంగ కార్యదర్శి హేగ్ టూర్ లో ఉన్న కారణంగాను తన భారత పర్యటనను రద్దు చేసుకుంటున్నానని మొమెన్ అంతకు ముందు చెప్పారని రవీష్ కుమార్ తెలిపారు.

.

.