Bandi Sanjay: రాబోయే మూడేళ్లు కేసీఆరే ముఖ్యమంత్రి… వరంగల్ పర్యటనలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్….

రాబోయే మూడేళ్లు కేసీఆరే ముఖ్యమంత్రి అని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. మంత్రి కేటీఆర్‌కు ముఖ్యమంత్రి పగ్గాలు ఇవ్వరని...

Bandi Sanjay: రాబోయే మూడేళ్లు కేసీఆరే ముఖ్యమంత్రి... వరంగల్ పర్యటనలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్....

Updated on: Jan 05, 2021 | 1:12 PM

Bandi Sanjay: రాబోయే మూడేళ్లు కేసీఆరే ముఖ్యమంత్రి అని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. మంత్రి కేటీఆర్‌కు ముఖ్యమంత్రి పగ్గాలు ఇవ్వరని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి మార్పు అనేది కేవలం మీడియా లీక్‌లో భాగంగా ప్రచారం మాత్రమేనని అన్నారు. కాగా, బండి వరంగల్‌ టూరులో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు. జనగామలో ఆయనకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రంలో చాలా మంది ప్రజాప్రతినిధులు రానున్న రోజుల్లో బీజేపీలో చేరతారని అన్నారు. ఏ ఎన్నికలు జరిగినా ఇకపై బీజేపీ గెలుస్తుందని తెలిపారు.

 

అనంతరం వరంగల్ కు బయలు దేరిన ఆయనకు కడిపికొండ వద్ద పార్టీ శ్రేణులు భారీ వాహనాల ర్యాలీతో స్వాగతం పలికారు. బీజేపీ వరంగల్ జిల్లా రావు పద్మ ఆధ్వర్యంలో బండి పర్యటనకు ఏర్పాట్లు చేశారు. ఈ వరంగల్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనకు బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. కాగా బండి వరంగల్ టూర్లో వరంగల్ జిల్లాకు చెందిన పలువురు ఇతర పార్టీ నేతలు బీజేపీలో చేరతారని స్థానిక బీజేపీ నాయకులు చెబుతున్నారు.

 

Also Read: SRSP: ఎస్సారెస్పీ కాలువకు గండి… భారీగా వస్తున్న నీరు… నీటమునిగిన సింగారం కాలనీ…

 

Loading...
Unable to load recommendations.
Follow Us