
సోషల్ మీడియా వచ్చిన దగ్గర నుంచి జనాల్లో క్రియేటివిటీ కొత్త పుంతలు తొక్కుతోంది. మీమ్స్, వీడియోస్ లాంటి పలు వైవిధ్యమైనవి తయారు చేస్తూ వీక్షకులను బాగా అలరిస్తున్నారు. ఇక ఇప్పుడు తాజాగా బహుబలి సినిమాలోని ఓ సీన్‌కు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. క్రియేటివిటీకి ఇదే నిదర్శనం అనేలా కొంతమంది ఎడిట్ చేసిన ఆ సీన్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
క్యాడ్‌బరి యాడ్‌కు బాహుబలి ‘కిస్ మీ క్లోజ్ యువర్ ఐస్’ అని పాడుతున్నట్లు కొందరు అద్భుతంగా ఎడిట్ చేశారు. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హాల్‌చల్ చేస్తోంది. నిజంగా బాహుబలి ‘కిస్ మీ’ అని అంటున్నట్లు లిప్ సింక్‌ను పర్ఫెక్ట్‌గా మ్యాచ్ చేశారు. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్స్ పెడుతూ విపరీతంగా షేర్లు చేస్తున్నారు.