అరె ! నిర్మల చేతిలో సూట్ కేసు ఏదీ ? ఇక ‘ బానిసత్వం ‘ పోయినట్టే !
ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం చేతిలో సూట్ కేసు బదులు ఓ ఎర్రబట్ట చుట్టి ఉన్న ఫోల్డర్ తో కనిపించారు. తన ఇదివరకటి ఆర్ధిక మంత్రులు చేతిలో సూట్ కేసులు పట్టుకుని పార్లమెంటులో ఎంటరయితే.. ఈమె మాత్రం ఇందుకు భిన్నంగా సంప్రదాయాన్ని పక్కన బెట్టి ఇలా కనిపించారు. ఆ ఫోల్డర్ పై నేషనల్ ఎంబ్లెమ్ కూడా ఉంది. ఈ ఫోల్డర్ ని ‘ బహిఖాతా ‘ అంటారట.. అంటే ఇంగ్ల్లీష్ లో లెడ్జర్ అని అర్థమని అంటున్నారు. […]
ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం చేతిలో సూట్ కేసు బదులు ఓ ఎర్రబట్ట చుట్టి ఉన్న ఫోల్డర్ తో కనిపించారు. తన ఇదివరకటి ఆర్ధిక మంత్రులు చేతిలో సూట్ కేసులు పట్టుకుని పార్లమెంటులో ఎంటరయితే.. ఈమె మాత్రం ఇందుకు భిన్నంగా సంప్రదాయాన్ని పక్కన బెట్టి ఇలా కనిపించారు. ఆ ఫోల్డర్ పై నేషనల్ ఎంబ్లెమ్ కూడా ఉంది. ఈ ఫోల్డర్ ని ‘ బహిఖాతా ‘ అంటారట.. అంటే ఇంగ్ల్లీష్ లో లెడ్జర్ అని అర్థమని అంటున్నారు. భారతీయ అలవాటును పక్కన బెట్టి దాని స్థానే ఈ కొత్త పధ్దతిని ప్రవేశపెట్టినట్టు చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యన్ తెలిపారు. బ్రిటిష్ బానిసత్వానికి మనం దూరమయ్యామనడానికి ఇది నిదర్శనమని, ఇక ఆ అలవాటు పోవాలని ఆయన అన్నారు.
గతంలో ఆర్ధిక మంత్రులు నల్లని, ఎర్రని, ఊదారంగు సూట్ కేసులు పట్టుకుని వచ్ఛేవారు. బడ్జెట్ కేసు అన్నది 18 వ శతాబ్దం నుంచి ప్రారంభమైంది. అప్పట్లో బ్రిటిష్ ఆర్ధిక మంత్రులు తమ బడ్జెట్ ప్రతులను భద్రంగా సూట్ కేసుల్లో పట్టుకుని వచ్చ్చేవారు. ఇది వారి ట్రెడిషన్ గా మారింది. బడ్జెట్ అన్నది అత్యంత సీక్రెట్ వ్యవహారమని, అందువల్ల ఎవరికీ తెలియకుండా ఉండాలంటే అదే మంచి పద్దతి ని వాళ్ళు భావించేవారు.. బ్రిటిష్ శకం ముగిసినా భారత పార్లమెంటు సంప్రదాయం వారి అలవాట్లను అనుసరించడం సిగ్గు చేటని కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యన్ పేర్కొన్నారు.