రాములోరి గుడికి బంగారు, వెండి ఇటుకలు..

ఆగస్టు 5… దేశ ప్రజల దశాబ్దాల నిరీక్షణ ఫలించనున్న రోజు. రామ జన్మభూమిలో రాములోరి గుడికి పునాదిరాయి పడనున్న రోజు. ఈ చరిత్రాత్మకమైన రోజుకు మరో మూడు రోజులే మిగిలున్న వేళ.. అందరి చూపు అయోధ్య వైపే నిలిచింది. రామా.. నీకు గుడి కడుతున్నామయ్యా.. అంటూ భక్త జనం మొక్కులు తీర్చుకునేందుకు రెడీ అవుతున్నారు. తరతరాల కల నెరవేరబోతోంది. ఆ మర్యాదా పురుషోత్తముడి ఆలయ నిర్మాణంలో ఉడుతా భక్తిగా.. తమిళనాడులోని శ్రీరంగం ఆలయం తరఫున ఓ బంగారు […]

రాములోరి గుడికి బంగారు, వెండి ఇటుకలు..

ఆగస్టు 5… దేశ ప్రజల దశాబ్దాల నిరీక్షణ ఫలించనున్న రోజు. రామ జన్మభూమిలో రాములోరి గుడికి పునాదిరాయి పడనున్న రోజు. ఈ చరిత్రాత్మకమైన రోజుకు మరో మూడు రోజులే మిగిలున్న వేళ.. అందరి చూపు అయోధ్య వైపే నిలిచింది.

రామా.. నీకు గుడి కడుతున్నామయ్యా.. అంటూ భక్త జనం మొక్కులు తీర్చుకునేందుకు రెడీ అవుతున్నారు. తరతరాల కల నెరవేరబోతోంది. ఆ మర్యాదా పురుషోత్తముడి ఆలయ నిర్మాణంలో ఉడుతా భక్తిగా.. తమిళనాడులోని శ్రీరంగం ఆలయం తరఫున ఓ బంగారు ఇటుకను పంపుతున్నట్లు ఆలయ సనాతన ధర్మ ప్రచారక్‌ వీరరాఘవన్‌ సంపత్‌ ప్రకటించారు.

అయోధ్య రాముడికి తెలంగాణ నుంచి వెండి ఇటుకలు పంపిస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌, హైదరాబాద్‌కు చెందిన చల్లా శ్రీనివాస్‌ చెరో నాలుగు వెండి ఇటుకలను సమర్పిస్తున్నట్లు తెలిపారు. కాగా, ఆగస్టు 5న ఉత్తర అమెరికాలోని అన్ని హిందూ ఆలయాల్లోనూ వర్చువల్‌గా సామూహిక ప్రార్థనలు నిర్వహించనున్నట్లు హెచ్‌ఎంఈసీ ప్రకటించింది.

ఇక రాములవారి ఆలయ నిర్మాణ భూమి పూజ కోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ కార్యక్రమంలో ప్రధాని మోడీతోపాటు మరో నలుగురు వేదికను పంచుకోనున్నారు.

Click on your DTH Provider to Add TV9 Telugu