AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యూఎస్‌ ఓపెన్‌ టెన్నిస్‌ గ్రాండ్‌స్లామ్‌కి బార్టీ షాక్‌..

కరోనా కారణంగా నిలిచిపోయిన ఆటలు ఇప్పుడిప్పుడే మొదలయ్యాయి. కరోనా వైరస్ భయం క్రీడాకారులను వెంటాడుతుంది. ఈ ఏడాది జరగాల్సిన ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌ నుంచి మహిళల ప్రపంచ నంబర్‌ వన్, ఆస్ట్రేలియా టెన్నిస్‌ ప్లేయర్‌ యాష్లే బార్టీ వైదొలిగింది. గురువారం ఆమె స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించింది.

యూఎస్‌ ఓపెన్‌ టెన్నిస్‌ గ్రాండ్‌స్లామ్‌కి బార్టీ షాక్‌..
Balaraju Goud
|

Updated on: Jul 31, 2020 | 3:22 AM

Share

కరోనా కారణంగా నిలిచిపోయిన ఆటలు ఇప్పుడిప్పుడే మొదలయ్యాయి. కరోనా వైరస్ భయం క్రీడాకారులను వెంటాడుతుంది. ఈ ఏడాది జరగాల్సిన ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌ నుంచి మహిళల ప్రపంచ నంబర్‌ వన్, ఆస్ట్రేలియా టెన్నిస్‌ ప్లేయర్‌ యాష్లే బార్టీ వైదొలిగింది. గురువారం ఆమె స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించింది. యూఎస్‌ ఓపెన్‌ ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్‌ 13 మధ్య జరగనుంది. అయితే, కరోనా విస్తరణ ఇంకా కొనసాగుతున్న వేళ తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు బార్టీ తెలిపింది.

ఈ మెగా ఈవెంట్‌తో పాటు కరోనా విరామం అనంతరం జరుగుతున్న తొలి టెన్నిస్‌ టోర్నమెంట్‌ అయిన సిన్సినాటి మాస్టర్స్‌ నుంచి కూడా తప్పుకుంటున్నట్లు ఆమె వెల్లడించింది. సెప్టెంబర్‌కు వాయిదా పడిన ఫ్రెంచ్‌ ఓపెన్‌లో ఆడేది లేనిది త్వరలో వెల్లడిస్తానని బార్టీ పేర్కొంది. ఆగస్టు 20 నుంచి మొదలయ్యే సిన్సినాటి టోర్నీలో పాల్గొనే ఆటగాళ్ల ప్రాథమిక జాబితాను టోర్నీ నిర్వాహకులు గత బుధవారం విడుదల చేశారు. ఇందులో పురుషుల విభాగంలో జొకోవిచ్, రాఫెల్, మెద్వెదేవ్, థీమ్‌ ఉండగా… మహిళా విభాగంలో సెరెనా , కోకో గౌఫ్‌ పేర్లు ఉన్నాయి. గ్రాండ్ స్లామ్ టోర్ని నుంచి బార్టీ వైదొలగడం పట్ల నిర్వహకుల్లో కొత్త టెన్షన్ మొదలైంది.