AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రతి నీటి బొట్టును కాపాడుకుందాం

ఉమ్మడి రాష్ట్రంలో సాగునీటి రంగంలో అనేక కష్టనష్టాలకు గురైన తెలంగాణ.. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ కృష్ణా, గోదావరి జలాల్లో మన హక్కును, నీటి వాటాను కాపాడుకొని తీరాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆధ్వర్యంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశం నిర్ణయించింది. ఒక్క చుక్క నీటిని కూడా వదులుకునే ప్రసక్తే లేదని, ఎంతటి పోరాటానికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని సమావేశం తీర్మానించింది.

ప్రతి నీటి బొట్టును కాపాడుకుందాం
Balaraju Goud
|

Updated on: Jul 31, 2020 | 3:02 AM

Share

ఉమ్మడి రాష్ట్రంలో సాగునీటి రంగంలో అనేక కష్టనష్టాలకు గురైన తెలంగాణ.. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ కృష్ణా, గోదావరి జలాల్లో మన హక్కును, నీటి వాటాను కాపాడుకొని తీరాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆధ్వర్యంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశం నిర్ణయించింది. ఒక్క చుక్క నీటిని కూడా వదులుకునే ప్రసక్తే లేదని, ఎంతటి పోరాటానికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని సమావేశం తీర్మానించింది.

ఏపీ, తెలంగాణ మధ్య నెలకొన్న జల వివాదాల పరిష్కారం కోసం కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఆగస్టు 5న ఏర్పాటు చేసేందుకు అభిప్రాయం చెప్పాల్సిందిగా ఆ శాఖ కార్యదర్శి యూపీ సింగ్‌ రాసిన లేఖపై గురువారం ప్రగతిభవన్‌లో నీటిపారుదలశాఖ నిపుణులు, అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశం నీటి వివాదాల పరిష్కారానికి అనుసరించాల్సిన వ్యూహంపై సుదీర్ఘంగా చర్చించింది. ఈ సమావేశానికి రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, రైసస అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సీఎస్‌ సోమేశ్ కుమార్, నీటిపారుదలశాఖ సలహాదారు ఎస్కే జోషి తదితరులు హాజరయ్యారు.

అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహణకు ఆగస్టు 5వ తేదీని కేంద్రం నిర్ణయించిందని, ఆ రోజున ముందే నిర్ణయించిన ప్రభుత్వ కార్యక్రమాలుండటం వల్ల అసౌకర్యంగా ఉంటుందన్న భావన సమావేశంలో వ్యక్తమైంది. దీంతోపాటు స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాక ఆగస్టు 20 తర్వాత సమావేశం ఉండేలా మరో తేదీని నిర్ణయించాలని కోరుతూ కేంద్ర జల వనరులశాఖకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేఖ రాయాలని ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం సూచించింది.

ఈ సందర్భంగా జరిగిన చర్చలో ఇరు రాష్ట్రాల జల వివాదాల పరిష్కారం విషయంలో కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ పనితీరు హాస్యాస్పదంగా ఉందని సమావేశం అసంతృప్తిని వ్యక్తం చేసింది. కొత్త రాష్ట్రాలు ఏర్పడినపుడు కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నీటి వాటాల పంపిణీ సవ్యంగా జరిగేలా చూసే సంప్రదాయం ఉందని, అయితే ఈ విషయంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని సమావేశంలో పలువురు అభిప్రాయపడ్డారు. ఇరు రాష్ట్రాల మధ్య నదీజలాల వివాదాలు లేని పరిస్థితుల్లో కేంద్రమంత్రి ఆధ్వర్యంలో నీటి పంపిణీ జరగాలని, వివాదాలున్నపుడు పరిష్కార బాధ్యతను ట్రైబ్యునల్‌కు అప్పగించాలి.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదాలు ముందునుంచీ ఉన్న నేపథ్యంలో పునర్విభజన చట్టం సెక్షన్ -13ను అనుసరించి వీటిని పరిష్కరించే బాధ్యతను ట్రైబ్యునల్‌కు అప్పగించాలని తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచీ కోరుతూ వచ్చింది. కానీ, తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తిని కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ పెడచెవిన పెట్టిందని సమావేశం అక్షేపించింది. కేంద్రం బాధ్యతారాహిత్యం వల్ల ఇరు రాష్ట్రాలు అనవసరంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని సమావేశంలో ఆవేదన వ్యక్తమైంది.

తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న కేసులు, ట్రైబ్యునల్‌ వివాదాలు న్యాయబద్ధంగా పరిష్కారం కావాలని, నిరంతర ఘర్షణ ఎవరికీ మంచిది కాదని సమావేశంలో ఏకాభిప్రాయం వ్యక్తమైంది. మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు సాగునీరందించేందుకు నిర్మిస్తున్న పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చి పూర్తి చేసి తీరాలని, అవాంతరాల్ని లెక్క చేయకుండా ముందుకు సాగాలని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించించింది. గోదావరి, కృష్ణా జలాల్లో మన రాష్ట్రం వాటాను ఎట్టి పరిస్థితుల్లో సమగ్రంగా, సమర్థంగా వినియోగించుకోవాలని, ఇందుకోసం రాజీలేని వైఖరిని అనుసరించాలని, ప్రాజెక్టుల నిర్మాణ పనులు శరవేగంగా ముందుకు సాగాలని సమావేశం బలంగా అభిప్రాయపడింది.

Follow Us
చిన్న వయసులోనే గుండెపోటుతో మృతి చెందుతున్న యువత.. అసలు కారణం ఇదే!
చిన్న వయసులోనే గుండెపోటుతో మృతి చెందుతున్న యువత.. అసలు కారణం ఇదే!
పెళ్లయిన వేళావిశేషం... అరుదైన ఘనతతో హిస్టరీకెక్కిన రష్మిక
పెళ్లయిన వేళావిశేషం... అరుదైన ఘనతతో హిస్టరీకెక్కిన రష్మిక
డీమార్ట్‌కు వెళ్లేవాళ్లకు ఈ విషయం తెలిస్తే అవాక్కవుతారు..
డీమార్ట్‌కు వెళ్లేవాళ్లకు ఈ విషయం తెలిస్తే అవాక్కవుతారు..
IPL 2026: చెన్నై ప్లేఆఫ్స్ చేరే ఛాన్స్.. ఎలాగో తెలుసా?
IPL 2026: చెన్నై ప్లేఆఫ్స్ చేరే ఛాన్స్.. ఎలాగో తెలుసా?
పెట్రోల్‌కి డబ్బులు నన్ను అడిగేవాడు వినాయక్..
పెట్రోల్‌కి డబ్బులు నన్ను అడిగేవాడు వినాయక్..
పిల్లల్లోనూ ఫ్యాటీ లివర్‌ సమస్యలు.. అసలు ఇది ఎందుకు వస్తుందంటే?
పిల్లల్లోనూ ఫ్యాటీ లివర్‌ సమస్యలు.. అసలు ఇది ఎందుకు వస్తుందంటే?
Team India: టీ20 ప్రపంచకప్ రేసులో 8మంది ఓపెనర్లు..
Team India: టీ20 ప్రపంచకప్ రేసులో 8మంది ఓపెనర్లు..
ఇటు మోడ్రన్ గా.. అటు సంప్రదాయంగా.. సోషల్ మీడియాలో వైరల్‌గా.. పవన్
ఇటు మోడ్రన్ గా.. అటు సంప్రదాయంగా.. సోషల్ మీడియాలో వైరల్‌గా.. పవన్
హోటల్‌కు వెళ్లే పనిలేదు.. ఇంట్లోనే కరకరలాడే రవ్వదోశ ఇలా చేసుకోండి
హోటల్‌కు వెళ్లే పనిలేదు.. ఇంట్లోనే కరకరలాడే రవ్వదోశ ఇలా చేసుకోండి
బాహుబలిలో నా వల్ల అనుష్కకి గాయం.. సీక్రెట్ బయటపెట్టిన అడివి శేష్
బాహుబలిలో నా వల్ల అనుష్కకి గాయం.. సీక్రెట్ బయటపెట్టిన అడివి శేష్