చరిత్ర సృష్టించిన మహిళా అంపైర్.. 144 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి..
Australia Woman Umpire: ఆస్ట్రేలియాకు చెందిన మహిళా అంపైర్ క్లెయిర్ పోలోసాక్ చరిత్ర సృష్టించింది. 144 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలిసారిగా..

Australia Woman Umpire: ఆస్ట్రేలియాకు చెందిన మహిళా అంపైర్ క్లెయిర్ పోలోసాక్ చరిత్ర సృష్టించింది. 144 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలిసారిగా పురుషుల టెస్టు మ్యాచ్‌కు అంపైర్‌గా వ్యవరించింది. సిడ్నీ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్టుకు ఫోర్త్ అంపైర్‌గా బాధ్యతలు నిర్వర్తించింది. ఈ టెస్టుకు పాల్ రీఫెల్, పాల్ విల్సన్ ప్రధాన అంపైర్లు కాగా.. బ్రూస్ ఆక్సెన్‌ఫోర్డ్ థర్డ్ అంపైర్, క్లెయిర్ పోలోసోక్ ఫోర్త్ అంపైర్‌గా ఉన్నారు.
పురుషుల వన్డే క్రికెట్‌లోనూ మొట్టమొదటి మహిళా అంపైర్‌గా క్లెయిర్ పోలోసోక్ రికార్డుల్లోకి ఎక్కారు. 2019లో జరిగిన వరల్డ్ క్రికెట్ లీగ్ పోటీల్లో నమీబియా, ఒమన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌కు అంపైర్‌గా వ్యవహరించారు. ఇక ఇప్పుడు టెస్టు క్రికెట్‌లోనూ తనకు అవకాశం దక్కడం పట్ల క్లెయిర్ పోలోసాక్ సంతోషం వ్యక్తం చేశారు. ఇది ప్రారంభం మాత్రమేనని.. మున్ముందు ఇంకా ఎంతోమంది మహిళలు అంపైర్లుగా పయనిస్తారని క్లెయిర్ అన్నారు. పురుషుల టెస్ట్ మ్యాచ్‌కు అంపైర్‌గా నియమితురాలైన క్లెయిర్ పోలోసాక్‌కి ఐసీసీ శుభాకాంక్షలు తెలిపింది.
Also Read:
మహిళా ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. ఏపీఎస్ఆర్టీసీ వినూత్న నిర్ణయం..!
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. GHMC కీలక నిర్ణయం.. ఇకపై స్ట్రీట్ ఫుడ్ గల్లీ నుంచి మీ ఇంటికే.!




