హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. GHMC కీలక నిర్ణయం.. ఇకపై స్ట్రీట్ ఫుడ్ గల్లీ నుంచి మీ ఇంటికే.!

Main Bhi Digital Campaign: మనలో చాలామందికి స్ట్రీట్ ఫుడ్ అంటే ఇష్టం. తమకు ఇష్టమైన స్ట్రీట్ ఫుడ్‌ను బయటికి వెళ్లి తినాలనే కోరిక ఉంటుంది...

హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. GHMC కీలక నిర్ణయం.. ఇకపై స్ట్రీట్ ఫుడ్ గల్లీ నుంచి మీ ఇంటికే.!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 06, 2021 | 7:09 PM

Main Bhi Digital Campaign: మనలో చాలామందికి స్ట్రీట్ ఫుడ్ అంటే ఇష్టం. తమకు ఇష్టమైన స్ట్రీట్ ఫుడ్‌ను బయటికి వెళ్లి తినాలనే కోరిక ఉంటుంది. అయితే కరోనా వ్యాప్తి, ‘స్ట్రెయిన్’ కలకలం నేపధ్యంలో పలువురు బయటకు వెళ్లేందుకు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. అందుకే అలాంటి స్ట్రీట్ ఫుడ్ ప్రియులకు GHMC గుడ్ న్యూస్ అందించింది. త్వరలోనే గల్లీల్లోని స్ట్రీట్ ఫుడ్‌ మన ఇళ్ళ వద్దకు రానుంది.

GHMC ప్రణాళికలో భాగంగా వీధి వ్యాపారులను ప్రోత్సహించేందుకు.. ఇకపై స్ట్రీట్ ఫుడ్‌ను జోమాటో, స్విగ్గీ, ఉబర్ లాంటి సంస్థల ద్వారా అందించనున్నారు. ఇందుకోసం వీధి వ్యాపారులకు ప్రత్యేక ప్రోఫైల్స్ రూపొందిస్తున్నారు. వీధి వ్యాపారాలు రిజిస్టర్ చేసుకునేందుకు ‘మై బీ డిజిటల్’ అనే పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ఈ క్రమంలోనే జనవరి 22 వరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనుంది.

Also Read:

కరోనా వ్యాక్సిన్.. జనవరి 13 నుంచి దేశమంతటా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం..!

మందుబాబులకు స్ట్రాంగ్ వార్నింగ్.. ఇకపై మద్యం సేవించి వాహనం నడిపితే జరిమానాయే కాదు..

ఆసుపత్రుల్లోని గాలిలో కరోనా వైరస్.. సీసీఎంబీ రీసెర్చ్‌లో సంచలన విషయాలు వెల్లడి.!