AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

South Indian Actress Rohini: కృష్ణుడి పాత్రలో బాలనటిగా తెరంగ్రేటం చేసి 300లకు పైగా సినిమాల్లో నటించిన తెలుగమ్మాయి

చిత్ర పరిశ్రమలో మహిళల్లో మల్టీ టాలెంటెడ్ పర్సన్స్ చాలాతక్కువే.. ముఖ్యంగా మెగా ఫోన్ పట్టి తమకంటూ ఓ ఫేమ్ ను సంపాదించుకున్న నటీమణులను వేళ్లమీదలెక్కపెట్టవచ్చు. అలనాటి భానుమతి, విజయనిర్మల తర్వాత..

South Indian Actress Rohini: కృష్ణుడి పాత్రలో బాలనటిగా తెరంగ్రేటం చేసి 300లకు పైగా సినిమాల్లో నటించిన తెలుగమ్మాయి
Surya Kala
|

Updated on: Jan 07, 2021 | 8:23 PM

Share

South Indian Actress Rohini: చిత్ర పరిశ్రమలో మహిళల్లో మల్టీ టాలెంటెడ్ పర్సన్స్ చాలాతక్కువే.. ముఖ్యంగా మెగా ఫోన్ పట్టి తమకంటూ ఓ ఫేమ్ ను సంపాదించుకున్న నటీమణులను వేళ్లమీదలెక్కపెట్టవచ్చు. అలనాటి భానుమతి, విజయనిర్మల తర్వాత శ్రీ ప్రియ, రోహిణి వంటి వారు వెండి తెరపై బహుముఖ ప్రజ్ఞాశాలుగా ఫేమ్ సంపాదించుకున్నారు. రోహిణి ఈ పేరు వింటే వెంటనే గుర్తుకు రాకపోవచ్చు.. కానీ అలామొదలైందిలో నాని తల్లి అన్నా.. బాహుబలి లో ప్రభాస్ అమ్మ అన్నా వెంటనే గుర్తుకు వస్తుంది.. వెంటనే ఆమె ఎందుకు మాకు తెలియదు.. అని అంటారు. చూడగానే ముద్దబంతి పువ్వులా ముగ్ధమనోహరమైన రూపం మన బంధువుల్లో ఒకరిలా అనిపిస్తుంది రోహిణి. ఇక వెండి తెరపై ఆమె నటించే పాత్రలు కూడా హోమ్లీగా ఉంటాయి. బాలనటిగా వెండి తెరపై ప్రవేశించిన రోహిణి డబ్బింగ్ ఆర్టిస్టుగా స్క్రిప్ట్ రైటర్ , డైరెక్టర్ ఇలా అనేక బాధ్యతలు నిర్వర్తించారు. నాలుగు దశాబ్దాలుగా ప్రయాణం సాగిస్తున్న రోహిణి అచ్చతెలుగు అమ్మాయి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినిమాల్లో సుమారుగా 300 పైగా సినిమాల్లో నటించారు.

అచ్చ తెలుగు అమ్మాయి రోహిణి. విశాఖ జిల్లా అనకాపల్లి సొంత ఊరు. ఐదేళ్ల వరకూ రోహిణి అనకాపల్లిలో లోనే ఉన్నారు. తల్లి మరణానంతరం తండ్రికి సినిమాలమీద ఉన్న ఇష్టంతో చైన్నై కు షిప్ట్ అయ్యారు. రోహిణి బాలనటిగా ‘యశోదకృష్ణ’ సినిమాలోని చిన్ని కృష్ణుడి పాత్రలో తెరంగ్రేటం చేశారు. అలా మొదలైన సినీ జర్నీ గత 45 ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది. రోహిణి తెలుగమ్మాయి అయినా మలయాళంలో హీరోయిన్ గా మంచి అవకాశాలు అందుకుంది. మంచి పేరు సంపాదించుకుంది. ఓ వైపు మలయాళంలో హీరోయిన్ గా నటిస్తూనే తెలుగు లో ప్రముఖ హీరోయిన్లలైన గిరిజ, అమల, మనీషా కొయిరాలా, ఐశ్వర్యరాయ్, వంటి వారికి డబ్బింగ్ చెప్పింది. ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నంది అవార్డు అందుకుంది. ఫస్ట్ మూవీలో హీరోయిన్ గా నటిస్తున్న సమయంలోనే రఘువరన్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారి రోహిణి రఘువరణం ను పెళ్లి చేసుకుంది. వీరిద్దరికి ఒక బాబు పుట్టిన తర్వాత విడాకులు తీసుకున్నారు. రోహిణి డైరెక్టర్‌గా మారి.. బాలనటుల కష్టనష్టాలపై ‘సైలెంట్ హ్యూస్’ పేరుతో డాక్యుమెంటరీని తీశారు. ఇక తమిళంలో సింగీతం శ్రీనివాసరావుగారి వద్ద సహాయ దర్శకురాలిగా పనిచేసిన రోహిణి ఓ సినిమాకు దర్శకత్వం కూడా వహించారు.

Also Read: