సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ సిరీస్..

కరోనా విరామం తర్వాత ఇంగ్లాండ్ వరుసగా అంతర్జాతీయ మ్యాచులకు ఆతిధ్యమిస్తు దూసుకుపోతోంది. ఇప్పటికే వెస్టిండీస్ తో టెస్ట్ సిరీస్ పూర్తి కాగా..

సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ సిరీస్..
Follow us

|

Updated on: Aug 14, 2020 | 8:29 PM

England Vs Australia: కరోనా విరామం తర్వాత ఇంగ్లాండ్ వరుసగా అంతర్జాతీయ మ్యాచులకు ఆతిధ్యమిస్తు దూసుకుపోతోంది. ఇప్పటికే వెస్టిండీస్ తో టెస్ట్ సిరీస్ పూర్తి కాగా.. ప్రస్తుతం పాకిస్థాన్ తో సిరీస్ కొనసాగుతోంది. ఇక ఈ సిరీస్ తర్వాత ఇంగ్లాండ్ సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియాకు ఆతిధ్యం ఇవ్వడానికి సిద్ధమవుతోంది. దీనికి క్రికెట్ ఆస్ట్రేలియా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతేకాకుండా 21 మంది ఆటగాళ్లతో కూడిన స్క్వాడ్ ను కూడా ప్రకటించింది. మొదట టీ20 మ్యాచులతో స్టార్ట్ కానున్న ఈ సిరీస్ సెప్టెంబర్ 16న పూర్తి అవుతుంది. సెప్టెంబర్ 4, 6, 8 తేదీల్లో మూడు టీ20లు.. ఆ తర్వాత 11, 13, 16 తేదీల్లో మూడు వన్డేలు జరగనున్నాయి. మాంచెస్టర్, సౌతాంఫ్టన్ వేదికలుగా ఈ మ్యాచులు జరుగుతాయి. దీనితో సెప్టెంబర్ 19 నుంచి మొదలుకానున్న ఐపీఎల్ కు ఈ రెండు జట్ల ఆటగాళ్లు దూరం కానున్నారు.

ఆస్ట్రేలియా జట్టు: ఆరోన్ ఫించ్ (కెప్టెన్), సీన్ అబోట్, అష్టన్ అగర్, అలెక్స్ క్యారీ, పాట్ కమ్మిన్స్, జోష్ హాజిల్‌వుడ్, మార్కస్ లబుషేన్, నాథన్ లియోన్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్వెల్, రిలే మెరెడిత్, జోష్ ఫిలిప్, డేనియల్ సామ్స్, కేన్ రిచర్డ్సన్, స్టీవ్‌స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, ఆండ్రూ టై, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా

Also Read:

ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఆ రోజే ‘జగనన్న విద్యా కానుక’..

కరోనాపై షాకింగ్ న్యూస్.. 16 అడుగుల వరకు వైరస్ వ్యాప్తి.!