AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శ్రీవారి బ్ర‌హ్మోత్స‌వాల్లో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా అత్తి వ‌ర‌ద‌ర్‌, గ‌రుడ‌గ‌మ‌న గోవిందా దేవ‌తారూపాలు!

తిరుమ‌ల శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాల్లో ఈసారి క‌ల్యాణవేదిక వ‌ద్ద త‌మిళ‌నాడులోని కాంచీపురంలో గ‌ల శ్రీ అత్తి వ‌ర‌ద‌రాజ‌స్వామివారి సెట్టింగు, గ‌రుడ‌గ‌మ‌న గోవిందా సైక‌త శిల్పం ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌నున్నాయి. ప్ర‌తి ఏడాదీ బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్భంగా టిటిడి ఉద్యాన‌వ‌న విభాగం ఫ‌ల‌పుష్ప ప్ర‌ద‌ర్శ‌న‌లో భాగంగా పురాణాల్లోని అంశాల‌తో భ‌క్తుల‌ను ఆక‌ట్టుకునేలా సెట్టింగుల‌ను రూపొందిస్తోంది. 40 ఏళ్ల త‌రువాత ఇటీవ‌ల ద‌ర్శ‌న‌మిచ్చిన కాంచీపురంలోని శ్రీ అత్తి వ‌ర‌ద‌రాజ‌స్వామివారిని దేశ‌వ్యాప్తంగా పెద్ద ఎత్తున భ‌క్తులు ద‌ర్శించుకున్న విష‌యం విదిత‌మే. తిరిగి 2059వ […]

శ్రీవారి బ్ర‌హ్మోత్స‌వాల్లో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా అత్తి వ‌ర‌ద‌ర్‌, గ‌రుడ‌గ‌మ‌న గోవిందా దేవ‌తారూపాలు!
TV9 Telugu Digital Desk
|

Updated on: Sep 29, 2019 | 7:33 PM

Share

తిరుమ‌ల శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాల్లో ఈసారి క‌ల్యాణవేదిక వ‌ద్ద త‌మిళ‌నాడులోని కాంచీపురంలో గ‌ల శ్రీ అత్తి వ‌ర‌ద‌రాజ‌స్వామివారి సెట్టింగు, గ‌రుడ‌గ‌మ‌న గోవిందా సైక‌త శిల్పం ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌నున్నాయి. ప్ర‌తి ఏడాదీ బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్భంగా టిటిడి ఉద్యాన‌వ‌న విభాగం ఫ‌ల‌పుష్ప ప్ర‌ద‌ర్శ‌న‌లో భాగంగా పురాణాల్లోని అంశాల‌తో భ‌క్తుల‌ను ఆక‌ట్టుకునేలా సెట్టింగుల‌ను రూపొందిస్తోంది.

40 ఏళ్ల త‌రువాత ఇటీవ‌ల ద‌ర్శ‌న‌మిచ్చిన కాంచీపురంలోని శ్రీ అత్తి వ‌ర‌ద‌రాజ‌స్వామివారిని దేశ‌వ్యాప్తంగా పెద్ద ఎత్తున భ‌క్తులు ద‌ర్శించుకున్న విష‌యం విదిత‌మే. తిరిగి 2059వ సంవ‌త్స‌రంలోనే స్వామివారు భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిస్తారు. గ‌తంలో ద‌ర్శించుకోలేని భ‌క్తుల కోసం టిటిడి మూడు భంగిమ‌ల్లో అనంత‌స‌రోవ‌రంలోని శ్రీ అత్తి వ‌ర‌ద‌రాజ‌స్వామివారి సెట్టింగుల‌ను ఏర్పాటుచేసింది.

అదేవిధంగా, గ‌రుడ గ‌మ‌న గోవిందా అనే పేరుతో బెంగళూరుకు చెందిన సోద‌రీమ‌ణులు కుమారి గౌరి, కుమారి నీలాంబిక చ‌క్క‌టి సైక‌త శిల్పాన్ని రూపొందిస్తున్నారు. శ్రీ మ‌హావిష్ణ‌వు త‌న‌కిష్ట‌మైన గ‌రుడునిపై వ‌స్తున్న విధంగా ఉన్న ఈ సైక‌త శిల్పం భ‌క్తుల‌కు భ‌క్తిభావాన్ని పంచుతోంది. రెండు రోజుల్లో ఈ సైక‌త శిల్పం త‌యారీ పూర్త‌వుతుంది.

Follow Us
2027 వన్డే వరల్డ్ కప్‌నకు మహాత్మా గాంధీకి ఉన్న లింక్ ఏంటి..?
2027 వన్డే వరల్డ్ కప్‌నకు మహాత్మా గాంధీకి ఉన్న లింక్ ఏంటి..?
ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు.. ప్రత్యక్ష ప్రసారం
ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు.. ప్రత్యక్ష ప్రసారం
కరీంనగర్ యువతి సత్తా.. ఏకంగా ఇంటెలిజెన్స్ బ్యూరోలో కొలువు!
కరీంనగర్ యువతి సత్తా.. ఏకంగా ఇంటెలిజెన్స్ బ్యూరోలో కొలువు!
ప్రతీ నెలా అకౌంట్లోకి రూ.5 వేలు.. కేంద్రం సూపర్ స్కీమ్
ప్రతీ నెలా అకౌంట్లోకి రూ.5 వేలు.. కేంద్రం సూపర్ స్కీమ్
దైవ దర్శనానికి వెళ్లి వేర్వేరు ప్రాంతాల్లో 9 మంది భక్తులు మృతి
దైవ దర్శనానికి వెళ్లి వేర్వేరు ప్రాంతాల్లో 9 మంది భక్తులు మృతి
ఆసియా కప్‌నకు పాక్ జట్టు ప్రకటన.. భారత్‌తో మ్యాచ్ ఆ రోజే
ఆసియా కప్‌నకు పాక్ జట్టు ప్రకటన.. భారత్‌తో మ్యాచ్ ఆ రోజే
6 తరాలు.. 83 మంది కుటుంబ సభ్యులతో అందరికీ ఒకే ఇల్లు.. ఒకే వంట
6 తరాలు.. 83 మంది కుటుంబ సభ్యులతో అందరికీ ఒకే ఇల్లు.. ఒకే వంట
శ్రావణ మాసంలో అష్ట లక్ష్మి యోగం.. వీరికి పట్టింది బంగారమే!
శ్రావణ మాసంలో అష్ట లక్ష్మి యోగం.. వీరికి పట్టింది బంగారమే!
చెల్లికి చివరి మెసేజ్ పంపి ఆత్మహత్య చేసుకున్న సాఫ్వ్‌వేర్ ఉద్యోగి
చెల్లికి చివరి మెసేజ్ పంపి ఆత్మహత్య చేసుకున్న సాఫ్వ్‌వేర్ ఉద్యోగి
కిచెన్‌లో పడగవిప్పి నాగుపాము ఏం చేసిందంటే.. ఇదిగో వీడియో
కిచెన్‌లో పడగవిప్పి నాగుపాము ఏం చేసిందంటే.. ఇదిగో వీడియో