ఢిల్లీ హాస్పటల్లో కోల్‌కతా సీన్..

పశ్చిమ బెంగాల్‌లో డాక్టర్లపై దాడి తర్వాత పరిణామాలు మరువక ముందే.. మరో ఘటన జరిగింది. ఢిల్లీలోని మహర్షి వాల్మీకి ఆస్పత్రిలో కొందరు హల్‌చల్ చేశారు. డాక్టర్లపై దాడికి ప్రయత్నించారు. హాస్పిటల్‌లో కనిపించిన ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. కుర్చీలు, అద్దాలు పగులగొట్టి నానా హంగామా చేశారు. ఢిల్లీలోని బవానా ప్రాంతంలో ఓ బాలికపై లైంగిక దాడి జరిగింది. ఈ కేసుకు సంబంధించి డాక్టర్లపై స్థానికులు దాడికి ప్రయత్నించారు. ఇదేంటని ప్రశ్నించిన సిబ్బందిపై కూడా భౌతికదాడులకు దిగారు. దీంతో.. ఆ […]

ఢిల్లీ హాస్పటల్లో కోల్‌కతా సీన్..

Edited By:

Updated on: Jun 19, 2019 | 10:11 AM

పశ్చిమ బెంగాల్‌లో డాక్టర్లపై దాడి తర్వాత పరిణామాలు మరువక ముందే.. మరో ఘటన జరిగింది. ఢిల్లీలోని మహర్షి వాల్మీకి ఆస్పత్రిలో కొందరు హల్‌చల్ చేశారు. డాక్టర్లపై దాడికి ప్రయత్నించారు. హాస్పిటల్‌లో కనిపించిన ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. కుర్చీలు, అద్దాలు పగులగొట్టి నానా హంగామా చేశారు.

ఢిల్లీలోని బవానా ప్రాంతంలో ఓ బాలికపై లైంగిక దాడి జరిగింది. ఈ కేసుకు సంబంధించి డాక్టర్లపై స్థానికులు దాడికి ప్రయత్నించారు. ఇదేంటని ప్రశ్నించిన సిబ్బందిపై కూడా భౌతికదాడులకు దిగారు. దీంతో.. ఆ సమయంలో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

దాడులకు పాల్పడ్డ విజువల్స్ అక్కడ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డాక్టర్లు ఆందోళన చేశారు. కాగా.. జూనియర్ డాక్టర్లు సమ్మె విరమించి 24 గంటలు గడవకముందే మరోసారి దాడి జరగడం దేశమంతటా అలజడి రేపుతోంది.