కరోనా ఎఫెక్ట్: ఉజ్జయినిలో అత్యధిక కరోనా మరణాలు..

| Edited By:

May 01, 2020 | 4:46 PM

కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలన్ని లాక్ డౌన్ విధించాయి. దేశంలో కరోనా మరణాలు అత్యధికంగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని నగరంలో నమోదు కావడం సంచలనం రేపింది.

కరోనా ఎఫెక్ట్: ఉజ్జయినిలో అత్యధిక కరోనా మరణాలు..
Follow us on

Ujjain: కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలన్ని లాక్ డౌన్ విధించాయి. దేశంలో కరోనా మరణాలు అత్యధికంగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని నగరంలో నమోదు కావడం సంచలనం రేపింది. ఏప్రిల్ 23వ తేదీ నుంచి ఏడు రోజుల్లోనే ఏడుగురు రోగులు మరణించారు. ఉజ్జయినిలో 76 మంది కరోనా రోగులు మృత్యువాత పడ్డారు. ప్రముఖ మహకాల్ దేవాలయం ఉన్న ఉజ్జయిని నగరంలో 12 ఏళ్లకు ఓ సారి కుంభమేళా జరుగుతోంది. దీంతో భక్తుల తాకిడి ఈ నగరంలో ఎక్కువగా ఉంటోంది.

వివరాల్లోకెళితే.. ఒక్క గురువారం రోజే కొత్తగా 137 కేసులు వెలుగుచూడగా 24 మంది మరణించారు. కరోనా అధికంగా ప్రబలిన ఇండోర్ నగరంలో మృతుల శాతం 4.40 శాతం కాగా భోపాల్ నగరంలో 2.89 శాతం ఉంది. జాతీయ స్థాయిలో కరోనా మరణాల శాతం 3.19 శాతం కాగా ఒక్క ఉజ్జయినిలోనే అత్యధికంగా 17.51శాతంగా ఉంది. ఉజ్జయినిలోని ప్రైవేటు మెడికల్ కళాశాల లాబోరేటరీలో కరోనా పరీక్షల్లో  జరిగిన జాప్యం వల్లనే మరణాల రేటు పెరిగిందని ఓ అధికారి చెప్పారు.

మరోవైపు.. మార్చి 25వతేదీన ఉజ్జయినిలో ఓ మహిళకు కరోనా వైరస్ సోకింది. మార్చి 31వతేదీ వరకు ఉజ్జయిని నగరంలో రెండే మరణాలు. ఏప్రిల్ 15కల్లా కరోనా మృతుల సంఖ్య 30కి పెరిగింది. మొదటి కరోనా రోగి కుటుంబంలో ఐదుగురికి కరోనా సోకింది. కంటైన్మెంటు జోన్ లుగా ప్రకటించి ఉజ్జయినిలో కరోనా కేసులతోపాటు మృతుల సంఖ్యను అరికట్టేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.