అసోంలో వరదలు.. జలదిగ్బంధంలో 1,556 గ్రామాలు

అసోంలో కురుస్తున్న భారీ వర్షాలతో ఇప్పటి వరకు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. సుమారు 1556 గ్రామాలు తుపానులో చిక్కుకున్నాయి. ధీమాజీ, కోక్రాఝర్,బిశ్వనాథ్, సోనిట్‌పుర్, డరాంగ్, బక్సా, బర్పేట, నల్బరీ,చైరంగ్, బోంగాయ్‌గావ్,లఖీంపూర్ వంటి ప్రాంతాలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. బ్రహ్మపుత్రా నది పొంగి ప్రవహిస్తుండటంతో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. వర్షాలు, వరదల కారణంగా నిరాశ్రయులైన వారికి ప్రభుత్వం రక్షణ చర్యలు ప్రారంభించింది. అధికారులు, సైనికులు రంగంలోకి దిగి సహయం అందిస్తున్నారు. మరోవైపు లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు […]

అసోంలో వరదలు.. జలదిగ్బంధంలో 1,556 గ్రామాలు

Edited By:

Updated on: Jul 12, 2019 | 8:40 PM

అసోంలో కురుస్తున్న భారీ వర్షాలతో ఇప్పటి వరకు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. సుమారు 1556 గ్రామాలు తుపానులో చిక్కుకున్నాయి. ధీమాజీ, కోక్రాఝర్,బిశ్వనాథ్, సోనిట్‌పుర్, డరాంగ్, బక్సా, బర్పేట, నల్బరీ,చైరంగ్, బోంగాయ్‌గావ్,లఖీంపూర్ వంటి ప్రాంతాలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.
బ్రహ్మపుత్రా నది పొంగి ప్రవహిస్తుండటంతో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. వర్షాలు, వరదల కారణంగా నిరాశ్రయులైన వారికి ప్రభుత్వం రక్షణ చర్యలు ప్రారంభించింది. అధికారులు, సైనికులు రంగంలోకి దిగి సహయం అందిస్తున్నారు. మరోవైపు లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us