Asaduddin owaisi: ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా మాట్లాడేలా తమ పిల్లలకు నేర్పిస్తామన్నారు. ప్రధానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు జైలుకు పంపించినా వెళ్ళడానికి సిద్ధమన్నారు. 24ఏళ్ల నుంచి సెక్యూరిటీ లేకుండా తిరుగుతున్నానని నన్ను ఎవరైనా చంపేయాలనుకుంటే చంపుకోవచ్చు అని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అవసరం ముస్లిములకు లేదన్నారు. కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు తన చెప్పుతో సమానమన్నారు. ప్రతి ముస్లిం పౌరుడిని ఒవైసీలా తయారుచేస్తానని స్పష్టంచేశారు. కాంగ్రెస్ ఎప్పటికి అధికారంలోకి రాదన్నారు. రాముడి పేరుతో బీజేపీ.. శివుడి పేరుతో కాంగ్రెస్.. హనుమాన్ పేరుతో ఆమ్ఆద్మీ పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. మేం నిజమైన ముస్లిములమని చెప్పుకోడానికి గర్వంగా ఉందన్నారు.