మోదీజీ ! దయచేసి నన్ను..

|

May 29, 2019 | 1:58 PM

ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ బుధవారం అనూహ్యంగా ప్రధాని మోదీకి లేఖ రాశారు. తన ఆరోగ్యం దృష్ట్యా తాను ఇక మంత్రిగా బాధ్యతలు చేపట్టలేనని, మరికొంత కాలం తాను చికిత్స పొందాల్సి ఉంటుందని అందులో పేర్కొన్న ఆయన,, అందువల్ల కొత్త కేబినెట్ లో తను స్థానం వహించలేనని పరోక్షంగా రాజీనామా చేస్తున్నట్టు వెల్లడించారు. అయితే రెండు రోజుల క్రితమే అరుణ్ జైట్లీ ఆరోగ్యంపై వస్తున్న వార్తలను నిరాధారమైనవిగా ప్రభుత్వ వర్గాలు ఖండించిన సంగతి తెలిసిందే.కానీ.. తాజాగా..ఆయన నేరుగా మోదీ […]

మోదీజీ ! దయచేసి నన్ను..
Follow us on

ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ బుధవారం అనూహ్యంగా ప్రధాని మోదీకి లేఖ రాశారు. తన ఆరోగ్యం దృష్ట్యా తాను ఇక మంత్రిగా బాధ్యతలు చేపట్టలేనని, మరికొంత కాలం తాను చికిత్స పొందాల్సి ఉంటుందని అందులో పేర్కొన్న ఆయన,, అందువల్ల కొత్త కేబినెట్ లో తను స్థానం వహించలేనని పరోక్షంగా రాజీనామా చేస్తున్నట్టు వెల్లడించారు. అయితే రెండు రోజుల క్రితమే అరుణ్ జైట్లీ ఆరోగ్యంపై వస్తున్న వార్తలను నిరాధారమైనవిగా ప్రభుత్వ వర్గాలు ఖండించిన సంగతి తెలిసిందే.కానీ.. తాజాగా..ఆయన నేరుగా మోదీ ని ఉద్దేశించి ఈ లేఖ రాయడం పార్టీ వర్గాల్లో కలకలం సృష్టించింది. లోగడ కూడా అరుణ్ జైట్లీ తన కిడ్నీ సమస్యకు అమెరికాలో చికిత్స పొందిన సంగతి తెలిసిందే.. ఆయన లేనప్పుడు తాత్కాలిక ఆర్ధిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మంత్రి పీయూష్ గోయెల్ పార్లమెంటులో ఇంటెరిమ్ బడ్జెట్ ను సమర్పించారు. అటు-అరుణ్ జైట్లీ లేఖపై మోదీ , ప్రభుత్వం ఎలా స్పందిస్తారో చూడాలి.