స్వదేశీ ఫైట‌ర్ జెట్‌ తేజ‌స్‌లో విహ‌రించిన ఆర్మీ చీఫ్‌

స్వదేశంలో తయారైన తేలికపాటి యుద్ధవిమానం తేజస్‌లో ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌ విహరించారు. బెంగళూరులోని యలహంక ఎయిర్‌బేస్‌ స్టేషన్‌లో జరుగుతున్న ఏరోఇండియా 2019 ప్రదర్శనలో భాగంగా మరో పైలట్ తో కలిసి కో పైలట్ గా రావత్ విమానంలో పైకి ఎగిరారు. అంతకుముందు ఆయన తేజస్‌లో ప్రయాణించేందుకు అవసరమైన శిక్షణ తీసుకొన్నారు. భారత్‌లో తయారైన యుద్ధ విమనంలో రావత్‌ ప్రయాణించడం ఇదే తొలిసారి. తేలికపాటి యుద్ధ విమానం తేజస్‌ బుధవారమే వాయుసేనలో చేరింది. ‘తేజస్‌ కు సంబంధించి […]

స్వదేశీ ఫైట‌ర్ జెట్‌ తేజ‌స్‌లో విహ‌రించిన ఆర్మీ చీఫ్‌

Edited By:

Updated on: Feb 14, 2020 | 2:06 PM

స్వదేశంలో తయారైన తేలికపాటి యుద్ధవిమానం తేజస్‌లో ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌ విహరించారు. బెంగళూరులోని యలహంక ఎయిర్‌బేస్‌ స్టేషన్‌లో జరుగుతున్న ఏరోఇండియా 2019 ప్రదర్శనలో భాగంగా మరో పైలట్ తో కలిసి కో పైలట్ గా రావత్ విమానంలో పైకి ఎగిరారు. అంతకుముందు ఆయన తేజస్‌లో ప్రయాణించేందుకు అవసరమైన శిక్షణ తీసుకొన్నారు. భారత్‌లో తయారైన యుద్ధ విమనంలో రావత్‌ ప్రయాణించడం ఇదే తొలిసారి. తేలికపాటి యుద్ధ విమానం తేజస్‌ బుధవారమే వాయుసేనలో చేరింది. ‘తేజస్‌ కు సంబంధించి పూర్తిస్థాయి నిర్వహణ అనుమతి ధ్రువీకరణ పత్రాన్ని డీఆర్‌డీవో బుధవారం భారత వైమానిక దళానికి అందజేసింది. యుద్ధాల్లో పాల్గొనేందుకు ఈ విమానం సిద్ధంగా ఉందని చెప్పేందుకు ఎఫ్‌వోసీ ధ్రువీకరణ పత్రం జారీ చేస్తారు. కాగా తేజస్‌ను హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ ఉత్పత్తి చేసింది. గాలిలో ఉండగానే ఇంధనాన్ని నింపుకోవడం, ఎలక్ట్రానిక్‌ యుద్ధ సూట్లుతోపాటు పలు రకాల బాంబులు-ఆయుధాలను కలిగి ఉండటం వంటి ప్రత్యేకతలు ఈ విమానానికి ఉన్నాయి.