కరోనా, లాక్‌డౌన్ కారణంగా నిలిచిపోయిన అర్జిత సేవలు ప్రారంభించాయి తెలంగాణలో ఆలయాలు. ఇందులో భాగంగా వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో ఆర్జిత సేవలు కూడా ఈ నెల 7 నుంచి ప్రారంభం కానున్నాయి.
కరోనా ప్రేరేపిత లాక్‌డౌన్ నుంచి భక్తులకు అనుమతి ఇవ్వడం లేదు. అన్‌లాక్‌లో భాగంగా కేంద్రం ఇచ్చిన సడలింపులతో భక్తులకు ప్రస్తుతం దర్శనం మాత్రమే కల్పిస్తుండగా.. ఆర్జిత సేవల్లో భక్తులు పాల్గొనేందుకు అవకాశం ఇవ్వడం లేదు. ఈ క్రమంలో ఈ నెల 7 నుంచి పలు సేవల్లో భక్తులకు పాల్గొనేందుకు అధికారులు అనుమతి ఇచ్చారు.
రాజన్నకు ప్రీతికరమైన కోడె మొక్కుతో పాటు సత్యనారాయణ వ్రతాల్లో పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తున్నారు దేవస్థానం అధికారులు. అభిషేకాలు, అన్నపూజ, కుంకుమపూజలకు మాత్రం అనుమతి నిరాకరించారు. భీమేశ్వరస్వామి, బద్దిపోచమ్మ ఆలయంలో అభిషేకాలు, బోనాల సమర్పణ కొనసాగించవచ్చని తెలిపారు.