నేటి నుంచి ఆలయాల్లో అర్జిత సేవలు

|

Oct 04, 2020 | 5:23 AM

ఆలయాల్లో ఆర్జిత సేవలు, పూజలు, ఇతర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు కొవి‌డ్‌ నిబంధనలను అనుసరించి భక్తులు భౌతిక దూరం పాటించేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని దేవాదాయ శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు.

నేటి నుంచి ఆలయాల్లో అర్జిత సేవలు
Follow us on

కరోనా, లాక్‌డౌన్‌ మహమ్మారి వ్యాప్తితో ఆలయాల్లో అన్ని రకాల సేవలను రద్దు చేశారు అధికారులు. చాలా రోజుల పాటు ఆలయాల్లో దర్శనాలు కూాడా నిలిచిపోయాయి.  కరోనాతో రద్దైన అన్ని సేవలు నేటి నుంచి ప్రారంభం అవుతున్నాయి.  అయితే  ఈ రోజు నుంచి తెలంగాణలోని ఆలయాల్లో ఆర్జిత సేవలు, పూజలు, ఇతర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు.

కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు కొవి‌డ్‌ నిబంధనలను అనుసరించి భక్తులు భౌతిక దూరం పాటించేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని దేవాదాయ శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. ఆలయ పరిసరాలను ఎప్పటికపుడు శానిటైజ్‌ చేయాలని సూచించారు. మాస్క్ తప్పని సరిగా ధరించేలా చూడాలని కోరారు.