బిగ్ బాస్ హౌస్‌లో పరిణామాలు నాటకీయంగా మారాయి. ఇప్పటికే షో అంతా పక్కా స్క్రిప్ట్ ప్రకారం నడుస్తోందంటూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. దేవీ నాగవల్లీ, కుమార్ సాయి ఎలిమినేషన్స్ విషయంలో నెటిజన్లు, వీక్షకులు బాగా హర్టయ్యారు. ఇక కొందర్ని బిగ్ బాస్ కావాలని సేవ్ చేస్తున్నాడనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. లవ్ ట్రాక్ కోసం అఖిల్‌ను, టాస్కుల కోసం మెహబూబ్‌ను కావాలనే ఉంచుతున్నారన్న అపవాదు బిగ్ బాస్ యాజమాన్యంపై పడింది. ఇక మోనల్ ఎవరి ఓట్ల వలన సేఫ్ అవుతుందో అంతుచిక్కని ప్రశ్నగా మారింది. ఇలా రకరకాల అనుమానాలు బిగ్ బాస్ హౌస్‌ను వెంటాడుతున్నాయి. తాజాగా జరిగిన ఎలిమినేషన్ ప్రక్రియ ద్వారా మిత్రుల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేశాడు బిగ్ బాస్. దీంట్లో వారు ఆశించిన కంటెంట్ దొరకలేదు. పెద్ద ఆర్గ్యుమెంట్ లేకుండా త్యాగాలు చేసుకున్నారు. ఇక అరియానా-మెహబూబ్ విషయంలో మాత్రం వీక్షకులు బాగా హర్ట్ అయ్యారు. అరియానా తన వెర్షన్ వినిపిస్తున్నప్పటికీ మెహబూబ్ మాత్రం తాను నామినేట్ అవ్వనని భీష్మించుకుని నిల్చున్నాడు. దీంతో అరియానానే వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే మిగతా నామినేట్ అయిన కంటెస్టెంట్లలో పోల్చుకుంటే అరియానా కాస్త వీక్ పర్సన్. దీంతో మెహబూబ్ తప్పు చేశాడని హౌస్‌లోని సభ్యులే చెప్పారు. ఇక నెటిజన్లు అయితే మెహబూబ్‌ని ఏకి పారేస్తున్నారు. ఇప్పుడున్న వారిలో హౌస్‌లో కాస్త నిజాయితీగా ఆడే వ్యక్తి ఎవరంటే అరియానా మాత్రమే. దీంతో ఆమెకు మద్దతుగా ఓట్లు వేయడం మొదలెట్టేశారు.
Also Read :