నేషనల్ పాలిటిక్స్ కోసం చంద్రులిద్దరూ ఒక్కటవుతారా.?

|

May 22, 2019 | 10:23 AM

తెలుగు రాష్ట్రాల చంద్రులు ఇద్దరూ ఒకటి కాబోతున్నారా.? అంటే అవునంటున్నాయి విశ్వసనీయ వర్గాలు. సార్వత్రిక ఎన్నికల అనంతరం సమీకరణాలు మారిపోతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా కేంద్రంలో మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పడంతో అటు చంద్రబాబు నాయుడు విపక్ష పార్టీలనింటిన్ని ఏకధాటి పైకి తీసుకొస్తుంటే… తెలంగాణ సీఎం కేసీఆర్ ఫెడరల్ ప్రయత్నాలను ముమ్మరం చేస్తూ… బీజేపీయేతర పార్టీ నేతలతో చర్చలు జరుపుతున్నారు. దీనితో విపక్ష పార్టీలను కలుపుకుంటూపోతున్న చంద్రబాబుతో కేసీఆర్ చేయి కలుపుతారానే సంకేతాలకు బలం […]

నేషనల్ పాలిటిక్స్ కోసం చంద్రులిద్దరూ ఒక్కటవుతారా.?
Follow us on

తెలుగు రాష్ట్రాల చంద్రులు ఇద్దరూ ఒకటి కాబోతున్నారా.? అంటే అవునంటున్నాయి విశ్వసనీయ వర్గాలు. సార్వత్రిక ఎన్నికల అనంతరం సమీకరణాలు మారిపోతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా కేంద్రంలో మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పడంతో అటు చంద్రబాబు నాయుడు విపక్ష పార్టీలనింటిన్ని ఏకధాటి పైకి తీసుకొస్తుంటే… తెలంగాణ సీఎం కేసీఆర్ ఫెడరల్ ప్రయత్నాలను ముమ్మరం చేస్తూ… బీజేపీయేతర పార్టీ నేతలతో చర్చలు జరుపుతున్నారు. దీనితో విపక్ష పార్టీలను కలుపుకుంటూపోతున్న చంద్రబాబుతో కేసీఆర్ చేయి కలుపుతారానే సంకేతాలకు బలం చేకూరుస్తున్నాయి. మరోవైపు ఎగ్జిట్ పోల్స్ అనంతరం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా చంద్రబాబుపై ఆరోపణలు చేయడం తగ్గించడంతో ఇద్దరు చంద్రలు త్వరలోనే కలిసి పని చేస్తారని స్పష్టత వస్తోంది.

కాగా కేసీఆర్ ఇటీవల చంద్రబాబుకు మిత్రుడైన కర్ణాటక సీఎం కుమారస్వామిని కలిసిన విషయం తెలిసిందే. చంద్రబాబు కూడా ప్రతిపక్షాల ఐక్యత కోసం టీఆర్ఎస్ వంటి తటస్థ పార్టీలతో చేతులు కలపడంలో తనకు ఎటువంటి సమస్యా లేదని అన్నారు. ఇక టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈ విషయం గురించి ప్రస్తావిస్తూ బీజేపీని వ్యతిరేకిస్తున్న ఏ పార్టీతోనైనా టీడీపీ జట్టు కట్టేందుకు సిద్ధంగా ఉందన్నారు.  కాగా ఈ ఇద్దరు చంద్రులు కలిస్తే భవిష్యత్త్ రాజకీయ పరిణామాలు మే23 తర్వాత ఎలా ఉంటాయో చూడాలి.?