సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖ మురళీనగర్లో బీభత్సం సృష్టించిన ఆర్టీసీ బస్సు, కారు ధ్వంసం, పలువురికి గాయాలు

సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖపట్నంలో ఆర్టీసీ బస్సు కొంచెం సేపటి క్రితం బీభత్సం స‌ృష్టించింది. మురళీనగర్ ప్రాంతంలో అదుపుతప్పి దూసుకెళ్లింది...

సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖ మురళీనగర్లో బీభత్సం సృష్టించిన ఆర్టీసీ బస్సు, కారు ధ్వంసం, పలువురికి గాయాలు

Updated on: Dec 18, 2020 | 11:20 AM

సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖపట్నంలో ఆర్టీసీ బస్సు కొంచెంసేపటి క్రితం బీభత్సం స‌ృష్టించింది. పాత పోస్టాఫీస్ నుంచి మాధవదార ఉడాకాలనీకి వెళ్తున్న బస్సు మురళీనగర్ ప్రాంతంలో అదుపుతప్పి జనాలమీదకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒక కారు ధ్వంసం కాగా, పలువురికి గాయాలయ్యాయి. ఒకని పరిస్థితి విషమంగా ఉన్నట్టు చెబుతున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాధమిక నిర్ధారణకు వచ్చారు. బాధితుల్ని హుటాహుటీన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.