సెల్లార్లలో నడుంలోతు నీళ్లు.. సాయం కోసం పడిగాపులు

|

Oct 15, 2020 | 7:53 AM

హైదరాబాద్ లోని అనేక లోతట్టు ప్రాంతాల్లోని కాలనీలు నీటిలో మూడో రోజూ చిక్కుకునే ఉన్నాయి. ఇళ్లలోకి చేరిన నీరు ఎప్పుడు పోతుందో అర్థంకాక, కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియక, జనం అయోమయంలో గదుల్లోనే పడిగాపులు కాస్తున్నారు. 150 కుటుంబాలు ఉన్న అపార్ట్మెంట్ లో కేవలం 3 కుటుంబాలే ప్రస్తుతం అక్కడ ఉన్నాయంటే… పరిస్థితి ఎంత దుర్భరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అధికారులకు చెప్పిన పట్టించుకోలేదని అంటున్నారు. జీహెచ్ఎంసీ కి ఫోన్ చేసినా ఫలితం శూన్యం అంటున్నారు విద్యానగర్ […]

సెల్లార్లలో నడుంలోతు నీళ్లు.. సాయం కోసం పడిగాపులు
Follow us on

హైదరాబాద్ లోని అనేక లోతట్టు ప్రాంతాల్లోని కాలనీలు నీటిలో మూడో రోజూ చిక్కుకునే ఉన్నాయి. ఇళ్లలోకి చేరిన నీరు ఎప్పుడు పోతుందో అర్థంకాక, కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియక, జనం అయోమయంలో గదుల్లోనే పడిగాపులు కాస్తున్నారు. 150 కుటుంబాలు ఉన్న అపార్ట్మెంట్ లో కేవలం 3 కుటుంబాలే ప్రస్తుతం అక్కడ ఉన్నాయంటే… పరిస్థితి ఎంత దుర్భరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అధికారులకు చెప్పిన పట్టించుకోలేదని అంటున్నారు. జీహెచ్ఎంసీ కి ఫోన్ చేసినా ఫలితం శూన్యం అంటున్నారు విద్యానగర్ వాసులు. కరెంట్ కావాలంటే సెల్లార్ లో నీళ్ళు ఖాళీ కావాలని అధికారులు అంటున్నారని చెబుతున్నారు. ఇటువంటి పరిస్థితులలో అధికారులు త్వరగా స్పందించక పోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ఇక భారీగా ప్రవహిస్తున్న వరద నీరుకు రోడ్లపై ఉన్న కార్లన్నీ ఒక్కచోటకి చేరుతున్నాయి.