గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదుట ఉన్న అండర్ బ్రిడ్జి వద్ద అతికించిన అశ్లీల సినిమా పోస్టర్లపై రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటిని వెంటనే తొలగించాలంటూ రిజిస్ట్రార్‌కు ఫోన్ చేశారు. రిజిస్ట్రార్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు అశ్లీల చిత్రాల పోస్టర్లను తొలగించారు. అదేవిధంగా గుంటూరు- విజయవాడ హైవే మార్గంలో పలుచోట్ల ఇలాంటి అశ్లీల పోస్టర్లు, హోర్డింగులు కనిపించడంపై వాసిరెడ్డి పద్మ అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే వాటిని తొలగించాలని వాటిని ఏర్పాటు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఐసీడీఎస్, జిల్లా పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు.
దీంతో గుంటూరు ఐసీడీఎస్ పీడీ మనోరంజని ఆధ్వర్యంలో మంగళగిరి రూరల్, పెదకాకాని పోలీసులు హుటాహుటిన రంగంలోకి దిగారు. ప్రధానమార్గాల్లో అతికించిన అశ్లీల పోస్టర్లను తొలగించారు. రోడ్డు డివైడర్ల మీద, రోడ్డు జంక్షన్లలో, ట్రాఫిక్ ఐలాండ్ల చుట్టూ అశ్లీలపోస్టర్లు అతికించరాదని, హోర్డింగులు ఏర్పాటుచేయరాదని సూచించారు. ఈ నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలుంటాయని వారు హెచ్చరించారు.
Also Read:
Konijeti Rosaiah: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య కన్నుమూత
Pregnant Woman: అంబులెన్స్‌లో ప్రసవం.. సమయస్ఫూర్తితో వైద్యం అందించిన సిబ్బంది.. తల్లీబిడ్డా క్షేమం