కాబోయే అమ్మకు అండగా ఏపీ సర్కార్

|

Sep 23, 2020 | 5:44 PM

గర్భిణుల్లో వస్తున్న మధుమేహం నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. గర్భిణుల్లో వచ్చే మధుమేహం ప్రమాదకారిగా మారింది. దేశవ్యాప్తంగా 10 శాతం మందిలో ఇది కనిపిస్తోందని కేంద్ర ఆరోగ్య శాఖ గుర్తించింది.

కాబోయే అమ్మకు అండగా ఏపీ సర్కార్
Follow us on

గర్భిణుల్లో వస్తున్న మధుమేహం నియంత్రణకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. గర్భిణుల్లో వచ్చే మధుమేహం ప్రమాదకారిగా మారింది. దేశవ్యాప్తంగా 10 శాతం మందిలో ఇది కనిపిస్తోందని కేంద్ర ఆరోగ్య శాఖ గుర్తించింది.

దీనివల్ల లక్షలాది మహిళలు తీవ్ర శారీరక ఇబ్బందులకు గురవుతున్నారని రిపోర్టులో పేర్కొంది. చివరకు టైప్‌–2 గా రూపుదాలుస్తోందని కేంద్ర ఆరోగ్య శాఖ తన నివేదికలో వెల్లడించింది. దీంతో ఏపీలో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.

ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సామాజిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణులకు మధుమేహ నిర్ధారణ పరీక్షలు జరిపేలా ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. మహిళ గర్భం దాల్చినట్టు నిర్ధారణ కాగానే మధుమేహ పరీక్ష నిర్వహిస్తారు. అప్పుడు లేదని తేలితే 24 నుంచి 28 వారాల గర్భిణికి మరోసారి పరీక్ష చేస్తారు. ఒకవేళ డయాబెటిస్‌ ఉన్నట్టు తేలితే నిపుణులైన వైద్యులతో వెంటనే చికిత్స అందజేస్తారు.  అలాంటి వారిని ప్రతినెలా పర్యవేక్షణ చేసి.. దీనిని టైప్‌–2 డయాబెటిస్‌గా మారకుండా నియంత్రిస్తారు. ఇలా కాబోయే అమ్మకు ఆరోగ్యాన్ని అందించే పనిలో పడింది ఏపీ సర్కార్.