Andhra Pradesh: ఏపీలో రేషన్ డీలర్ల సమ్మె ఎందుకు..? వారి డిమాండ్లు ఏంటి.. ప్రభుత్వం ఏమంటుంది?

|

Oct 27, 2021 | 2:34 PM

ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ డీలర్ల ఆందోళనలు కొనసాగుతున్నాయ్. జీవో నెంబర్ టెన్ రద్దు కోసం పోరుబాట పట్టారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామంటున్నారు.

Andhra Pradesh: ఏపీలో రేషన్ డీలర్ల సమ్మె ఎందుకు..? వారి డిమాండ్లు ఏంటి.. ప్రభుత్వం ఏమంటుంది?
Ap Ration Dealers Strike
Follow us on

ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ డీలర్ల ఆందోళనలు కొనసాగుతున్నాయ్. జీవో నెంబర్ టెన్ రద్దు కోసం పోరుబాట పట్టారు. స్టేట్‌ వైడ్‌గా రేషన్ దిగుమతిని, పంపిణీని నిలిపివేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి స్పందించేవరకు తమ ఆందోళనలు కొనసాగుతాయంటున్నారు. రేషన్ డీలర్ల డిమాండ్లలో గన్నీ సంచులు ఒకటి. గన్నీ సంచుల్లో డీలర్లకు సరుకుల సప్లై జరుగుతుంది. ఈ గన్నీ సంచుల్ని డీలర్లే అమ్ముకునేవారు. ఎంతోకొంత ఆదాయం వచ్చేది. ఇప్పుడీ గన్నీ సంచుల్ని ప్రభుత్వమే తీసేసుకుంటోంది. దాంతో ఆర్ధికంగా మరింత నష్టపోతున్నామని డీలర్లు అంటున్నారు. కనీసం నిర్వహణ ఖర్చులు కూడా రాకపోతే రేషన్ షాపుల్ని ఎలా నడపాలని డీలర్లు ప్రశ్నిస్తున్నారు. అలాగే, ఏళ్లతరబడి పేరుకుపోయిన ఎండీఎం, ఐసీడీఎస్ బకాయల్ని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. డీడీ నగదు వాపస్, ప్రైస్ డిఫరెన్స్ సర్క్యులర్ అమలు చేయాలంటున్నారు. డీలర్‌లకు ఏవైనా సమస్యలు ఉంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి.. అంతేకాని బెదిరిస్తే భయపడేది లేదంటూ సివిల్ సప్లై మినిస్టర్ కొడాలి నాని వార్నింగ్ ఇచ్చారు. డీలర్లు బంద్ చేసినంత మాత్రాన రేషన్ పంపిణీ ఆగిపోదంటున్నారు. ప్రజలకు నిత్యావసరాలు అందించడం ప్రభుత్వ బాధ్యతని… దాన్ని ఎవరు అడ్డుకుందాం అనుకున్నా కుదరదు అన్నారు. నవంబర్ ఒకటవ తేదీన  రేషన్ యథావిధిగా పంపిణీ చేస్తామని మంత్రి తెలిపారు.

వచ్చేదే పది పదిహేను వేల రూపాయల ఆదాయం. దాంతోనే కుటుంబాలను పోషించుకుంటున్నాం. ఇప్పుడు ఈ గన్నీ సంచుల్ని లాగేసుకోవడంతో ఆదాయం సగానికి సగం పడిపోయింది. ఇక, తాము ఎలా బతకాలని రేషన్ డీలర్లు ప్రశ్నిస్తున్నారు.

Also Read: ఏపీ గంజాయి హబ్‌గా మారింది.. వివిధ రాష్ట్రాల పోలీస్ అధికారుల వీడియోలు షేర్ చేసిన పవన్