పేకాట కేసులో మరో ట్విస్ట్.. మంత్రి తమ్ముడు అరెస్ట్..!

|

Aug 31, 2020 | 9:42 AM

కర్నూలు జిల్లా గుమ్మనూరు పేకాట క్లబ్ కేసులో మరో కీలక ట్విస్ట్ బయట పడింది.పేకాట క్లబ్ నిర్వాహకుల్లో మంత్రి జయరామ్‌ సోదరుడు గుమ్మనూరు నారాయణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనితో పాటు ఇద్దరు మంత్రి అనుచరుల్ని అరెస్ట్ చేశారు. వీరిలో జగన్, శ్రీధర్ ఉన్నట్లుగా తెలుస్తోంది. వీరంతా క్లబ్ నిర్వాహణలో కీలకంగా ఉన్నట్లు పోలీసులు తేల్చారు. అయితే ముందుగా ఈక్లబ్ నిర్వహణలో తమ కుటుంబ సభ్యులకు ఎలాంటి సంబంధం లేదన్న మంత్రి జయరామ్.. తర్వాత మాట మార్చి […]

పేకాట కేసులో మరో ట్విస్ట్.. మంత్రి తమ్ముడు అరెస్ట్..!
Follow us on

కర్నూలు జిల్లా గుమ్మనూరు పేకాట క్లబ్ కేసులో మరో కీలక ట్విస్ట్ బయట పడింది.పేకాట క్లబ్ నిర్వాహకుల్లో మంత్రి జయరామ్‌ సోదరుడు గుమ్మనూరు నారాయణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనితో పాటు ఇద్దరు మంత్రి అనుచరుల్ని అరెస్ట్ చేశారు. వీరిలో జగన్, శ్రీధర్ ఉన్నట్లుగా తెలుస్తోంది. వీరంతా క్లబ్ నిర్వాహణలో కీలకంగా ఉన్నట్లు పోలీసులు తేల్చారు. అయితే ముందుగా ఈక్లబ్ నిర్వహణలో తమ కుటుంబ సభ్యులకు ఎలాంటి సంబంధం లేదన్న మంత్రి జయరామ్.. తర్వాత మాట మార్చి ఎవరు అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడిన కఠినంగా శిక్షిస్తామంటున్నారు.

పేకాట ఆడుతున్నవారిని పోలీసులు పట్టుకున్నారు. ఇందులో కడప, అనంతపురం జిల్లాలతో పాటు కర్ణాటకలోని బళ్లారి, చిత్రదుర్గ, సిందనూరు, శిరిగుప్ప, రాయచూర్‌ ప్రాంతాల నుంచి పేకాడేందుకు వస్తారు. పేకాట ఆడేందుకు వచ్చిన వారి నుంచి టోకన్‌ సిస్టమ్‌గా 3 నుంచి 5 వేల రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. ఆడే ప్రతి వ్యక్తి కూడా ఇన్ఫార్మర్లకు సైతం డబ్బులు కట్టాల్సిందే.

ఇక్కడే భారీగా అక్రమ మద్యం ఉన్నట్లు సమాచారం రావడంతో SEB పోలీసులు 3బృందాలుగా విడిపోయి దాడులు నిర్వహించారు. మఫ్టీలో ఉన్న SEB పోలీసులపై పేకాటరాయుళ్లు రాళ్లు రువ్వారు. పోలీసుల కళ్లలో కారం చల్లారు. ఏకంగా ఓ సీఐపై దాడి చేసి గాయపర్చారు. క్లబ్ నిర్వహకులు యుద్ధవాతావరణం సృష్టించడంతో SEB పోలీసులు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. స్పాట్‌కి చేరుకున్న అధికారులు 33 మందిని అదుపులోకి తీసుకున్నారు. 5 లక్షల 34 వేల రూపాయల క్యాష్ స్వాధీనం చేసుకున్నారు. 35 కార్లు, 6 బైకుల్ని సీజ్‌ చేసారు.