పంట నష్టం‌ అంచనాపై లోకేష్‌కి ఏం తెలుసు? : బొత్స

|

Oct 17, 2020 | 2:25 PM

టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేష్ అవగాహన లేని మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. పంట నష్టం పై లోకేష్ ఏమి తెలిసి మాట్లాడుతున్నారు? అని ప్రశ్నించారు. “వరదలు తగ్గాక పంట నష్టం అంచనాలు వేస్తారు.. తెలియకపోతే వాళ్ళ నాన్నని అడిగి తెలుసుకోవాలి” అంటూ సెటైర్లు వేశారు. వరద తగ్గాక ఎన్యుమరేషన్ చేసి నష్ట పరిహారం చెల్లిస్తామని మంత్రి చెప్పారు. బిసి కార్పొరేషన్ల ద్వారా బిసిలందరికీ […]

పంట నష్టం‌ అంచనాపై లోకేష్‌కి ఏం తెలుసు? : బొత్స
Follow us on

టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేష్ అవగాహన లేని మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. పంట నష్టం పై లోకేష్ ఏమి తెలిసి మాట్లాడుతున్నారు? అని ప్రశ్నించారు. “వరదలు తగ్గాక పంట నష్టం అంచనాలు వేస్తారు.. తెలియకపోతే వాళ్ళ నాన్నని అడిగి తెలుసుకోవాలి” అంటూ సెటైర్లు వేశారు. వరద తగ్గాక ఎన్యుమరేషన్ చేసి నష్ట పరిహారం చెల్లిస్తామని మంత్రి చెప్పారు. బిసి కార్పొరేషన్ల ద్వారా బిసిలందరికీ లబ్ది చేకూరుతుందని.. అనేక స్కీం లతో ప్రభుత్వం మహిళకు ఆర్థిక పరిపుష్టి చేకూరుస్తుందని బొత్స పేర్కొన్నారు. కులంపై నిబద్దత, పార్టీపట్ల విధేయత ఉన్నవారిని బిసి కార్పొరేషన్లలో నియమిస్తామని బొత్స వెల్లడించారు.