‘ఒక ఎమ్మెల్యే, ఒక మాజీ ఎమ్మెల్యే ఆక్రమించుకున్న ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంటే.. అది కక్ష సాధింపా.?’ : మంత్రి అవంతి
21వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజును అన్ని నియోజకవర్గాలలో చేయాలని వైసీపీ నాయకులను అదేశించామని వైసీపీ సీనియర్ నేత,..
21వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజును అన్ని నియోజకవర్గాలలో చేయాలని వైసీపీ నాయకులను అదేశించామని వైసీపీ సీనియర్ నేత, మంత్రి అవ౦తి శ్రీనివాస్ చెప్పారు. టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి భూ వివాదంపై విశాఖలో స్పందించిన ఆయన, ప్రభుత్వ భూమిని ఎవరు అక్రమించినా ఉపేక్షించేదిలేదని తేల్చిచెప్పారు. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రతిపక్ష నేతలు అడుగడుగునా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. మూడు రాజధానులే తమ విధానం అని చెప్పాన ఆయన, రాబోయే నామినేటెడ్ పోస్టులలో పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలను గుర్తిస్తామని తెలిపారు. విశాఖ లో ఒక ఎమ్మెల్యే, ఒక మాజీ ఎమ్మెల్యే, ప్రభుత్వ భూమి అక్రమించుకుంటే ప్రభుత్వ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.. దానిని టీడీపీ నేతలు కక్షసాధింపు చర్యలు అంటున్నారు అని అవంతి ఫైరయ్యారు.