AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గురుగ్రామ్ లో ఆసుపత్రిపై రోగి బంధువుల దాడి, ట్రక్కుతో ఢీ కొట్టి, నానా విధ్వంసం, వీడియో సాక్షిగా

హర్యానాలోని గురుగ్రామ్ లో ఓ ఆసుపత్రిపై ట్రక్కుతో దాడి చేశారు ఇద్దరు రోగుల బంధువులు. ఈ వృధ్ధ రోగులకు చికిత్సపై ఒకే కుటుంబానికి చెందిన సభ్యుల మధ్య రేగిన వాగ్యుధ్ధం చిలికి చిలికి గాలివానగా..

గురుగ్రామ్ లో ఆసుపత్రిపై రోగి  బంధువుల దాడి,  ట్రక్కుతో ఢీ కొట్టి, నానా విధ్వంసం, వీడియో సాక్షిగా
Umakanth Rao
| Edited By: |

Updated on: Dec 20, 2020 | 3:19 PM

Share

హర్యానాలోని గురుగ్రామ్ లో ఓ ఆసుపత్రిపై ట్రక్కుతో దాడి చేశారు ఇద్దరు రోగుల బంధువులు. ఈ వృధ్ధ రోగులకు చికిత్సపై ఒకే కుటుంబానికి చెందిన సభ్యుల మధ్య రేగిన వాగ్యుధ్ధం చిలికి చిలికి గాలివానగా మారింది. దాంతో ఓ వ్యక్తి తన బంధువులతో కలిసి ట్రక్కులో వచ్చాడు. ఆ వాహనంతో ఆసుపత్రిపై కసిదీరా దాడి చేశాడు. ఏడెనిమిది సార్లు ట్రక్కుతో ఢీ కొట్టగా హాస్పిటల్ లోని పరికరాలు ధ్వంస మయ్యాయి. అతగాడు ఆగ్రహంతో అక్కడే ఉన్న మరికొన్ని వాహనాలను కూడా ఢీ కొట్టడంతో అవి దెబ్బ తిన్నాయి. ఇదంతా వీడియోకెక్కింది. . ఈ వ్యక్తి తాలూకు రోగులకు చికిత్స బాగానే అందుతోందని, అయితే వారి రెండు కుటుంబాల మధ్య తలెత్తిన గొడవతో ఆ వ్యక్తి ఈ బీభత్సానికి పాల్పడ్డాడని హాస్పిటల్ యాజమాన్యం తెలిపింది. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. ఈ ఘటనపై వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.   ఇక్కడి రోగులకు, ఆసుపత్రి స్టాఫ్ కు ఏదైనా జరిగిఉంటే అని అంతా ఆందోళన చెందారు.

Follow Us
ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూసేవారికి ప్రభుత్వం గుడ్ న్యూస్
ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూసేవారికి ప్రభుత్వం గుడ్ న్యూస్
హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనున్న శ్రీకాంత్ కూతురు..
హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనున్న శ్రీకాంత్ కూతురు..
జ్వరం అని నిర్లక్ష్యం వద్దు.. పెరుగుతున్న ఫ్లూ బాధితులు..
జ్వరం అని నిర్లక్ష్యం వద్దు.. పెరుగుతున్న ఫ్లూ బాధితులు..
అంటార్కిటికాలో కరుగుతున్న మంచుకు పెంగ్విన్‌ పక్షుల రెట్టలే కారణం!
అంటార్కిటికాలో కరుగుతున్న మంచుకు పెంగ్విన్‌ పక్షుల రెట్టలే కారణం!
త్రాసు లేకుండానే ఏనుగు బరువు కొలవాలి.. ఎలా? చిక్కుప్రశ్న
త్రాసు లేకుండానే ఏనుగు బరువు కొలవాలి.. ఎలా? చిక్కుప్రశ్న
రాసిపెట్టుకోండి.. వన్డే ప్రపంచకప్‌లో సెమీస్ చేరే 4 జట్లు ఇవే..!
రాసిపెట్టుకోండి.. వన్డే ప్రపంచకప్‌లో సెమీస్ చేరే 4 జట్లు ఇవే..!
ఊళ్లో వరుస చావులు.. OTTలో భయపెడుతోన్న హారర్ థ్రిల్లర్
ఊళ్లో వరుస చావులు.. OTTలో భయపెడుతోన్న హారర్ థ్రిల్లర్
16.5 కోట్ల నాటి శిలాజం.. నీటిలో ఈదుతూ వేటాడిన క్షీరదంగా గుర్తింపు
16.5 కోట్ల నాటి శిలాజం.. నీటిలో ఈదుతూ వేటాడిన క్షీరదంగా గుర్తింపు
నిజాయితీ ఎందుకు అవసరం? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన జీవిత పాఠం!
నిజాయితీ ఎందుకు అవసరం? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన జీవిత పాఠం!
నిరుద్యోగితకు అసలైన కొలమానం ఏంటి..? అంకెల వెనుక అసలు నిజాలివే..
నిరుద్యోగితకు అసలైన కొలమానం ఏంటి..? అంకెల వెనుక అసలు నిజాలివే..