Breaking News: సుప్రీం కోర్టును ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం.. హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ..

|

Jan 21, 2021 | 6:00 PM

AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. పంచాయితీ ఎన్నికలపై రాష్ట్ర హైకోర్టు...

Breaking News: సుప్రీం కోర్టును ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం.. హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ..
Follow us on

AP Local Body Elections: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. పంచాయితీ ఎన్నికలపై రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ జగన్ సర్కార్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. వ్యాక్సినేషన్ సమయంలో ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని సర్కార్ పిటిషన్‌లో పేర్కొంది. కాగా, పంచాయితీ ఎన్నికలు యధావిధిగా నిర్వహించాలని రాష్ట్ర హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ ఉదయం తీర్పునిచ్చిన సంగతి విదితమే.

అంతకముందు స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టుకు సంబంధించిన సింగిల్ జడ్జ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు. ఎన్నికలను యధావిధిగా.. ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించాలంటూ హైకోర్టు డివిజన్ బెంచ్ తాజాగా తీర్పును ఇచ్చింది. ఇప్పుడు ఆ తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది.

Also Read:

శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఫిబ్రవరి కోటా దర్శన టికెట్లు విడుదల..

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ఏపీ డీజీపీ విరాళం.. ఎంత ఇచ్చారంటే..!

ఐపీఎల్ 2021: వేలంలోకి స్మిత్, మ్యాక్స్‌వెల్, హర్భజన్.. ఫ్రాంచైజీల వారీగా రిలీజ్/రిటైన్ ఆటగాళ్ల లిస్టు ఇదే..