AP Inter Colleges: ఏపీ: ఆగష్టు నుంచి ఇంటర్ కళాశాలల రీ-ఓపెన్.. సెలవులు కుదింపు..!

|

Jul 12, 2020 | 6:50 PM

కరోనా వైరస్ లాక్‌డౌన్‌ కారణంగా మూతపడిన కాలేజీలు, విద్యాసంస్థలను తిరిగి ప్రారంభించేందుకు ఏపీ ప్రభుత్వం రంగం సిద్దం చేస్తోంది. ఇందులో భాగంగానే ఇంటర్ కళాశాలలను ఆగష్టు 3 నుంచి రీ-ఓపెన్ చేసేలా ఇంటర్ విద్యాశాఖ 2020-21 అకడిమిక్ క్యాలెండర్‌ను రూపొందించింది.

AP Inter Colleges: ఏపీ: ఆగష్టు నుంచి ఇంటర్ కళాశాలల రీ-ఓపెన్.. సెలవులు కుదింపు..!
Follow us on

AP Inter Colleges: కరోనా వైరస్ లాక్‌డౌన్‌ కారణంగా మూతపడిన కాలేజీలు, విద్యాసంస్థలను తిరిగి ప్రారంభించేందుకు ఏపీ ప్రభుత్వం రంగం సిద్దం చేస్తోంది. ఇందులో భాగంగానే ఇంటర్ కళాశాలలను ఆగష్టు 3 నుంచి రీ-ఓపెన్ చేసేలా ఇంటర్ విద్యాశాఖ 2020-21 అకడిమిక్ క్యాలెండర్‌ను రూపొందించింది. అంతేకాకుండా కొత్త విద్యా సంవత్సరం నుంచి యూనిట్ పరీక్షల విధానాన్ని ప్రవేశ పెట్టనున్నారు. జేఈఈ, ఎంసెట్ లాంటి పోటి పరీక్షలకు వారిని సిద్దం చేసేందుకు తగ్గట్టుగా మల్టిపుల్ ఛాయస్ క్వశ్చన్స్, ఖాళీలు నింపడం లాంటి ప్రశ్నలు విద్యాశాఖ అధికారులు రూపొందిస్తున్నారు. దీనికోసం విద్యార్ధులకు ప్రత్యేకంగా సబ్జెక్ట్‌కు ఓ వర్క్‌బుక్‌ను ఇవ్వనున్నారు.

ఇంటర్ కళాశాలలు 196 పనిదినాలు పని చేయనున్నాయి. ఉదయం సైన్స్.. మధ్యాహ్నం ఆర్ట్స్ గ్రూపుల విద్యార్ధులకు తరగతులు నిర్వహించనున్నారు. సీబీఎస్ఈ తరహాలో 30 శాతం సిలబస్ తగ్గినేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రెండో శనివారం కూడా కాలేజీలు వర్క్ చేయనుండగా.. పండగ సెలవులను కూడా కుదించనున్నారు. అటు ఆన్లైన్ పాఠాలు నిర్వహించేందుకు వీడియోలను రూపొందిస్తున్నారు. మార్చిలోనే ఫైనల్ ఎగ్జామ్స్ జరగనున్నాయి.

Also Read:

 కరోనా కట్టడిలో జగన్ సర్కార్ దూకుడు.. ఇంటికే ఉచితంగా కరోనా కిట్..

విద్యార్ధులకు ఆ రోజే ‘జగనన్న విద్యా కానుక’.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..

హెచ్‌సీయూ విద్యార్ధులకు గుడ్ న్యూస్.. నో ఎగ్జామ్స్.. ఓన్లీ గ్రేడింగ్.!