ముస్కాన్‌తో బాల కార్మిక వ్యవస్థ నుంచి విముక్తి

Operation Muskan : ఆపరేషన్ ముస్కాన్ ద్వారా బాల కార్మిక వ్యవస్థ నుంచి విముక్తి కల్పిస్తున్నామని ఏపీ హోం మంత్రి మేకతోటి సుచరిత‌ తెలిపారు. గతేడాది 2,500 మంది బాలలను గుర్తించి ఆదుకున్నామన్నారు. బాలల సంక్షేమానికి ముఖ్యమంత్రి జగన్ పెద్ద పీట‌ వేస్తున్నారని అన్నారు. బాలలను పనిలో పెట్టుకొంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఒకసారి బాలలను రెస్క్యూ చేస్తే ‌మరలా వారు ఆ కోవలేకి వెళ్ళడం మళ్లీ పట్డుబడితే వారిని పనిలో పెట్టుకున్న వారితోపాటు తల్లిదండ్రులపై […]

ముస్కాన్‌తో బాల కార్మిక వ్యవస్థ నుంచి విముక్తి

Updated on: Nov 04, 2020 | 9:02 PM

Operation Muskan : ఆపరేషన్ ముస్కాన్ ద్వారా బాల కార్మిక వ్యవస్థ నుంచి విముక్తి కల్పిస్తున్నామని ఏపీ హోం మంత్రి మేకతోటి సుచరిత‌ తెలిపారు. గతేడాది 2,500 మంది బాలలను గుర్తించి ఆదుకున్నామన్నారు. బాలల సంక్షేమానికి ముఖ్యమంత్రి జగన్ పెద్ద పీట‌ వేస్తున్నారని అన్నారు. బాలలను పనిలో పెట్టుకొంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఒకసారి బాలలను రెస్క్యూ చేస్తే ‌మరలా వారు ఆ కోవలేకి వెళ్ళడం మళ్లీ పట్డుబడితే వారిని పనిలో పెట్టుకున్న వారితోపాటు తల్లిదండ్రులపై కూడా కేసులు నమోదు చేస్తామని తెలిపారు. గతంలో 4 వేల మంది బాల కార్మికులు ఉంటే ఇప్పుడు కోవిడ్ నేపథ్యంలో పాఠశాలలు లేకపోవడంతో 16 వేల మంది బాలలను రెస్క్యూ చేయడం బాధాకరంగా ఉందన్నారు. రెస్క్యూద్వారా గుర్తించిన బాల కార్మికులకు ప్రభుత్వ పథకాలు అన్నీ అమలయ్యేలా చూస్తామని హోంమంత్రి సుచరిత స్పష్టం చేశారు.