బోండా ఉమ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు

విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత బొండా ఉమకు హైకోర్టులో చుక్కెదురైంది. వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఎన్నికపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. విష్ణు ఎన్నికను రద్దు చేయాలంటూ బొండా పిటిషన్‌ వేశారు. ఈ మేరకు విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు ఆయన పిటిషన్‌ను తోసిపుచ్చింది. బొండా ఉమా దాఖలు చేసిన పిటిషన్‌కు అర్హత లేనిదిగా పేర్కొంది. విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గంలో ఎన్నికల ఓట్ల లెక్కింపు సక్రమంగా జరగలేదంటూ ఆయన హైకోర్టును […]

  • Tv9 Telugu
  • Publish Date - 9:58 pm, Fri, 28 June 19
బోండా ఉమ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు

విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత బొండా ఉమకు హైకోర్టులో చుక్కెదురైంది. వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఎన్నికపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. విష్ణు ఎన్నికను రద్దు చేయాలంటూ బొండా పిటిషన్‌ వేశారు. ఈ మేరకు విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు ఆయన పిటిషన్‌ను తోసిపుచ్చింది. బొండా ఉమా దాఖలు చేసిన పిటిషన్‌కు అర్హత లేనిదిగా పేర్కొంది.

విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గంలో ఎన్నికల ఓట్ల లెక్కింపు సక్రమంగా జరగలేదంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. టీడీపీ అభ్యర్ధి బోండా ఉమాపై వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కేవలం 25 ఓట్ల తేడాతో గెలుపొందారు. దీంతో ఆయన కోర్టులో పిటిషన్ వేశారు.