Big Breaking : ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేసిన హైకోర్టు.. కీలక ఉత్తర్వులు..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీనియర్ ఐపీఎస్ అధికారి, మాజీ ఇంటిలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుపై ఉన్న సస్పెన్షన్‌ను హైకోర్టు ఎత్తేసింది. వెంకటేశ్వరరావు రిట్ పిటిషన్‌ను పరిగణలోకి తీసుకున్న కోర్టు.. క్యాట్ ఇచ్చిన ఆర్డర్‌ను పక్కన పెడుతూ…ఆయ‌న‌ సస్పెన్షన్ చెల్లదని వెల్ల‌డించింది. వెంటనే ఆయన్ను విధుల్లోకి తీసుకోవాలని స‌ర్కార్ ను ఆదేశించింది. సస్పెన్షన్ కాలంలో పెండింగ్‌లో పెట్టిన‌ జీతభత్యాలను చెల్లించాలని ఆదేశించింది. బాధ్యతల గ‌ల ప‌దవిలో ఉండి అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డార‌ని ఏపీ ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావు మార్చిలో సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు […]

Big Breaking : ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేసిన హైకోర్టు.. కీలక ఉత్తర్వులు..

Updated on: May 22, 2020 | 3:18 PM

ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీనియర్ ఐపీఎస్ అధికారి, మాజీ ఇంటిలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుపై ఉన్న సస్పెన్షన్‌ను హైకోర్టు ఎత్తేసింది. వెంకటేశ్వరరావు రిట్ పిటిషన్‌ను పరిగణలోకి తీసుకున్న కోర్టు.. క్యాట్ ఇచ్చిన ఆర్డర్‌ను పక్కన పెడుతూ…ఆయ‌న‌ సస్పెన్షన్ చెల్లదని వెల్ల‌డించింది. వెంటనే ఆయన్ను విధుల్లోకి తీసుకోవాలని స‌ర్కార్ ను ఆదేశించింది. సస్పెన్షన్ కాలంలో పెండింగ్‌లో పెట్టిన‌ జీతభత్యాలను చెల్లించాలని ఆదేశించింది.

బాధ్యతల గ‌ల ప‌దవిలో ఉండి అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డార‌ని ఏపీ ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావు మార్చిలో సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిఘా పరికరాల కొనుగోళ్లలో ఆయ‌న అక్రమాలకు పాల్పడినట్లు అప్ప‌ట్లో అభియోగాలు న‌మోద‌య్యాయి. డీజీపీ ఇచ్చిన రిపోర్ట్ మేర‌కు స‌స్పెండ్ చేసిన‌ట్టు అప్పుడు ఏపీ ప్రభుత్వం వెల్ల‌డించింది. అనంత‌రం స‌ర్కార్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వెంకటేశ్వరరావు క్యాట్‌ను ఆశ్రయంచారు. తన సస్పెన్షన్ చట్టవిరుద్ధమని.. తన 30 ఏళ్ల‌ స‌ర్వీసులో అవార్డులు సైతం వ‌చ్చాయ‌ని..ఒక్క ఆరోప‌ణ కూడా లేదని.. ప్ర‌భుత్వ‌మే త‌న‌పై క‌క్ష‌పూరితంగా వ్య‌వ‌రిస్తుంద‌ని ఆయ‌న ఆరోపించారు. అయితే క్యాట్ కూడా ఏపీ స‌ర్కార్ విధించిన సస్పెన్షన్‌ను సమర్థించింది. ఆ త‌ర్వాత ఆయ‌న‌ హైకోర్టుకు వెళ్ల‌డంతో విచార‌ణ అనంత‌రం తాజాగా ఊర‌ట ల‌భించింది. కాగా మాజీ సీఎం చంద్రబాబు హయాంలో ఏబీ వెంకటేశ్వరరావు ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పనిచేశారు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీ ఫిర్యాదు మేరకు ఆయన్ను ఇంటెలిజన్స్ చీఫ్ పదవి నుంచి ఎన్నికల సంఘం బదిలీ చేసింది.