రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లులపై హైకోర్టు విచారణ వాయిదా..

| Edited By:

Jul 23, 2020 | 12:17 PM

ఏపీలో రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లులపై హైకోర్టులో విచారణ ఆగస్టు 6కు వాయిదా పడింది. గవర్నర్‌ ఆమోదానికి బిల్లులు పంపిన నేపథ్యంలో పిటిషన్లు దాఖలయ్యాయి. హైకోర్టు విచారణను ఆగస్టు 6కు వాయిదా వేసింది.

రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లులపై హైకోర్టు విచారణ వాయిదా..
Follow us on

ఏపీలో రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లులపై హైకోర్టులో విచారణ ఆగస్టు 6కు వాయిదా పడింది. గవర్నర్‌ ఆమోదానికి బిల్లులు పంపిన నేపథ్యంలో పిటిషన్లు దాఖలయ్యాయి. హైకోర్టు విచారణను ఆగస్టు 6కు వాయిదా వేసింది. హైకోర్టు నిర్మాణాన్ని పూర్తిచేయాలంటూ దాఖలైన పిటిషన్లను మేం ఎలా విచారించగలం? ఒకవేళ ఈ వ్యాజ్యాల్లో ప్రభుత్వం విజయవంతమైతే హైకోర్టు వేరే చోటుకు వెళ్తుంది కదా? మారుతూ ఉన్న పరిస్థితుల నేపథ్యంలో పిటిషన్లపై ప్రస్తుతం విచారణ చేయలేమని హైకోర్టు తెలిపింది.

ప్రతి పరిణామంపై దాఖలైన పిటిషన్లను విచారించలేమని హైకోర్టు సూచించింది. రాజధాని నిర్మాణంకోసం సుమారు లక్షన్నర కోట్లు ఖర్చు అవుతుందన్న విషయాన్ని అప్పటి ప్రభుత్వంలో పలు కీలక పదవుల్లో ఉన్నవారు వెల్లడించారని, అది తన కౌంటర్లో ఉందని అడ్వకేట్‌ జనరల్‌ వెల్లడించారు. దీనిపై విచారణ గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హైకోర్టు స్పష్టంచేసింది.

Also Read: ఎంట్రెన్స్‌ పరీక్షలు రద్దు.. డీమ్డ్‌ వర్సిటీలకు డిమాండ్..