టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు బదిలీ

టీటీడీ జేఈవో శ్రీనివాసరాజును బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీనివాసరాజును సాధారణ పరిపాలన శాఖకు బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు వీఎంఆర్డీఏ మెట్రోపాలిటన్ కమిషనర్‌గా ఉన్న బసంత్‌ కుమార్‌కు టీటీడీ జేఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం.. తక్షణమే బాధ్యతలు చేపట్టాలని ఆదేశాలిచ్చింది. అయితే శ్రీనివాసరాజు గత ఎనిమిదేళ్లుగా టీటీడీ జేఈవోగా పని చేస్తున్నారు.2011లో రెండేళ్ల కాలపరిమితితో జేఈవోగా బాధ్యతలు పూర్తి చేసుకున్నప్పటికీ.. […]

టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు బదిలీ

Edited By:

Updated on: Jul 01, 2019 | 7:15 PM

టీటీడీ జేఈవో శ్రీనివాసరాజును బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీనివాసరాజును సాధారణ పరిపాలన శాఖకు బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు వీఎంఆర్డీఏ మెట్రోపాలిటన్ కమిషనర్‌గా ఉన్న బసంత్‌ కుమార్‌కు టీటీడీ జేఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం.. తక్షణమే బాధ్యతలు చేపట్టాలని ఆదేశాలిచ్చింది.

అయితే శ్రీనివాసరాజు గత ఎనిమిదేళ్లుగా టీటీడీ జేఈవోగా పని చేస్తున్నారు.2011లో రెండేళ్ల కాలపరిమితితో జేఈవోగా బాధ్యతలు పూర్తి చేసుకున్నప్పటికీ.. అప్పటి ప్రభుత్వం ఆయన పదవీ కాలాన్ని పొడిగిస్తూ వస్తోంది. గత ప్రభుత్వాలు నాలుగు సార్లు జేఈవోగా శ్రీనివాసరాజును కొనసాగించాలంటూ ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు బసంత్ కుమార్ గతంలో రాజ్‌భవన్‌లో పనిచేశారు.

Loading...
Unable to load recommendations.
Follow Us