జగన్ సర్కార్ ముస్లిం మతపెద్దలకు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇమాంలు, మౌజమ్‌లకు గౌరవ వేతనం విడుదల చేసింది. వక్ఫ్ బోర్డు సీఈవో అలీం బాషా ఈ విషయం తెలిపారు. సుమారు రూ. 23 కోట్లకు పైగా నిధులను రెండు రోజులుగా ఆయా వక్ఫ్ సంస్థల ఖాతాల్లో గవర్నమెంట్ జమ చేసినట్లు వివరించారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఏపిలోని 10 వేల మంది లబ్ధిదారులకు నిధులు విడుదల చేసినట్లు తెలిపారు. ఒక్కో ఇమాంలకు రూ. 5 వేలు, మౌజమ్‌కు రూ. 3 వేల చొప్పున సర్కార్ నిధులు విడుదల చేసిందని చెప్పారు. గత ఏడాది కూడా వైసీపీ ప్రభుత్వం మొత్తం ఇమాంలు, మౌజమ్‌లకు రూ. 49.6 కోట్ల గౌరవ వేతనం అందించినట్లు అలీం బాషా వెల్లడించారు.
కాగా, ఇమాంలు, మౌజమ్‌కు ప్రతి నెలా గౌరవ వేతనం అంజేస్తామని సీఎం జగన్ తన ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదే ఈ పథకాన్ని అమలు చేసి..మాట నిలబెట్టుకున్నారు. తాజాగా, ఈ ఏడాదికి సంబంధించిన నిధులను జగన్ ప్రభుత్వం విడుదల చేసింది.
Also Read :
ఏపీ :వారి అకౌంట్లలో నేరుగా రూ.10వేలు జమ
IPL 2020 : ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్న కేఎల్ రాహుల్