ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కరోనా కోసం ప్రత్యేక యాప్..!

|

Jul 25, 2020 | 3:10 PM

కరోనా వస్తే ఏం చేయాలి.? ఎవరిని సంప్రదించాలి.? అనే అంశాలపై ప్రజలకు అవగాహన కలిగేలా ఏపీ ప్రభుత్వం తాజాగా ఓ మొబైల్ అప్లికేషన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కరోనా కోసం ప్రత్యేక యాప్..!
Follow us on

Mobile App For Coronavirus Information: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ విలయతాండవం సృష్టిస్తోంది. గత వారం రోజులుగా రికార్డుస్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఇప్పటికే పలు నగరాలు స్వచ్చందంగా లాక్ డౌన్ పాటిస్తుండగా.. రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. భారీ సంఖ్యలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తోంది. అలాగే కరోనా వస్తే ఏం చేయాలి.? ఎవరిని సంప్రదించాలి.? అనే అంశాలపై ప్రజలకు అవగాహన కలిగేలా విస్తృతంగా ప్రచారం చేయాలని.. ప్రతీ చోటా హోర్డింగ్స్ పెట్టాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించిన సంగతి తెలిసిందే.

అంతేకాకుండా తాజాగా ఈ సందేహాలకు పరిష్కారం దొరికే విధంగా కోవిడ్ 19 ఆంధ్రప్రదేశ్ అనే పేరుతో ఓ అప్లికేషన్‌ను జగన్ సర్కార్ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. కరోనాపై అవగాహన కలిగేలా ప్రజలకు అవసరమైన ఇన్ఫర్మేషన్ ఇందులో దొరుకుతుంది. రాష్ట్రంలో నమోదైన కేసుల వివరాలు, కోవిడ్ ఆసుపత్రులు, క్వారంటైన్ కేంద్రాలు, కరోనా నిర్ధారణ పరీక్ష కేంద్రాలకు సంబంధించిన పూర్తి సమాచారం దీని ద్వారా తెలుసుకోవచ్చు. ఈ లింక్ https://bit.ly/30fvmbm సహాయంతో యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

Also Read:

కోవిడ్ మరణాలు తగ్గించేందుకు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..

బియ్యం కార్డుదారులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం..

‘పేరు’ కోసమే సుశాంత్ ప్రయత్నించాడు..అనురాగ్ కశ్యప్ సంచలన వ్యాఖ్యలు..

‘దిల్ బేచారా’ మూవీ రివ్యూ… కంటతడి పెట్టిన సుశాంత్ యాక్టింగ్..