తగ్గేది లేదన్న జగన్..’ఇంగ్లీషు మీడియం’ అమలుకు జీవో జారీ

|

Nov 21, 2019 | 1:54 PM

ఎన్ని వివాదాలు నెలుకున్నా సీఎం జగన్ వెనక్కి తగ్గట్లేదు. ప్రతిపక్షాల నుంచి ఎదురయ్యే విమర్శలను ఆయన పెద్దగా లెక్క చెయ్యట్లేదు. రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో…  ఒకటి నుంచి ఎనిమిదో  తరగతి వరకు బోధనను ఇంగ్లీషు మీడియంలోకి మార్చాలని జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. పలువురు సాహితీ వేత్తలు, తెలుగు భాషా పండితులు సైతం ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేశారు. అభ్యర్థనలు పరిగణలోకి తీసుకున్న జగన్.. […]

తగ్గేది లేదన్న జగన్..ఇంగ్లీషు మీడియం అమలుకు జీవో జారీ
Follow us on

ఎన్ని వివాదాలు నెలుకున్నా సీఎం జగన్ వెనక్కి తగ్గట్లేదు. ప్రతిపక్షాల నుంచి ఎదురయ్యే విమర్శలను ఆయన పెద్దగా లెక్క చెయ్యట్లేదు. రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో…  ఒకటి నుంచి ఎనిమిదో  తరగతి వరకు బోధనను ఇంగ్లీషు మీడియంలోకి మార్చాలని జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. పలువురు సాహితీ వేత్తలు, తెలుగు భాషా పండితులు సైతం ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేశారు. అభ్యర్థనలు పరిగణలోకి తీసుకున్న జగన్.. కాస్త సమాలోచనలు చేసి ఒకటి నుంచి ఆరో తరగతి వరకే ఇంగ్లీషు మీడియం ప్రవేశపెడతామని పేర్కొన్నారు.

ఆ తర్వాత ప్రతి ఏడాది ఒక్కో తరగతిని ఇంగ్లీషు మీడియంలోకి మారుస్తూ వెళ్తారు. తాజాగా ఇందుకు సంబంధించి  పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ విధానం అమలులోకి రానున్నట్లు పేర్కుంది.  దీంతో వచ్చే ఏడాదికి ఇంగ్లీషు మీడియంలో పుస్తకాలను ముద్రించి, స్కూళ్లు రీ ఓపెన్ చేసేసరికి అందుబాటులోకి తీసుకురావాలని విద్యాశాఖ అధికారులకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో ఇంగ్లీషు మీడియం అమలు కోసం.. అందుకు తగ్గ నైపుణ్యం ఉన్న ఉపాధ్యాయుల నియమించేందుకు, వారికి  శిక్షణ ఇచ్చేందుకు విద్యాశాఖ కమీషనర్ కసరత్తులు ప్రారంభించారు.