అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే రైతులకి పలు ప్రాయోజిత పథకాలను ప్రవేశపెడుతూ కీలక నిర్ణయాలు తీసుకున్న సీఎం జగన్..వారి పట్ల తన పంథా ఏంటో ముందుగానే స్పష్టం చేశారు. తాజాగా విపరీతమైన నష్టాల్లో ఉన్న శనగరైతుల పట్ల సీఎం ఉదారభావంతో వ్యవహరించారు.
గొడౌన్లలో మగ్గుతున్న శనగలను మార్కెట్ రేటు కంటే అదనంగా క్వింటాలుకు రూ.1500 చెల్లించి కొనుకోలు చేయాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ధరల స్థిరీకరణ నిధి నుంచి శనగ రైతులను ఆదుకోవాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. వ్యవసాయ మార్కెట్ కమిటీల నుంచి శనగ రైతుల జాబితా మేరకు చెల్లింపులు జరపాలని ఆదేశించింది. కాాగా ప్రస్తుతం క్వింటాల్ శనగలు మార్కెట్ ధర రూ.5 వేలుగా ఉంది.