నంద్యాలలో కుటుంబం సామూహిక ఆత్మహత్యపై సీఎం జగన్ ఆరా

కర్నూలు జిల్లా నంద్యాలలో అబ్దుల్‌ సలాం ఫ్యామలీ మొత్తం సామూహిక ఆత్మహత్య పాల్పడటం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే.

నంద్యాలలో కుటుంబం సామూహిక ఆత్మహత్యపై సీఎం జగన్ ఆరా

Updated on: Nov 07, 2020 | 9:09 PM

కర్నూలు జిల్లా నంద్యాలలో అబ్దుల్‌ సలాం ఫ్యామలీ మొత్తం సామూహిక ఆత్మహత్య పాల్పడటం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ  ఘటనపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి  వాస్తవాలు వెలికితీసేందుకు ముగ్గురు ఐపీఎస్ అధికారులతో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఐజీ శంకర్ బత్ర నేతృత్వంలోని టీమ్‌ను నంద్యాలకు పంపనున్నట్లు డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు.

సీఎం స్పందనపై మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్‌ ఫారూక్‌ హర్షం వ్యక్తం చేశారు.   రాష్ట్రంలో ముస్లిం, మైనారిటీలపై ఇటీవల జరిగిన దాడులకు సంబంధించిన వివరాలు తెలపగానే సీఎం వెంటనే స్పందించారని చెప్పారు.  విచారణ కమిటీ వేసినందుకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు ధన్యవాదాలు తెలిపారు.

Also Read :

భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్..సర్వదర్శనం టోకెన్ల జారీ కేంద్రాలు పెంపు

హజ్‌ యాత్రకు కొవిడ్‌ నెగెటివ్‌ రిపోర్టు తప్పనిసరి