హజ్‌ యాత్రకు కొవిడ్‌ నెగెటివ్‌ రిపోర్టు తప్పనిసరి

హజ్‌కు వెళ్లాలనుకునే వారు డిసెంబర్‌ 10లోపు దరఖాస్తులు చేసుకోవాలని కేంద్రమంత్రి ముఖ్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ సూచించారు.

హజ్‌ యాత్రకు కొవిడ్‌ నెగెటివ్‌ రిపోర్టు తప్పనిసరి
Hajj 2021
Follow us

|

Updated on: Nov 07, 2020 | 6:40 PM

హజ్‌కు వెళ్లాలనుకునే వారు డిసెంబర్‌ 10లోపు దరఖాస్తులు చేసుకోవాలని కేంద్రమంత్రి ముఖ్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ సూచించారు. ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌లో, హజ్‌ మొబైల్‌ యాప్‌లోనైనా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న వేళ 2021లో సౌదీ అరేబియాలోని హజ్‌కు వెళ్లే యాత్రికులు  కొవిడ్ నెగెటివ్‌ సర్టిఫికేట్ తప్పనిసరిగా సమర్పించాల్సిందేనని మంత్రి స్పష్టం చేశారు. యాత్రకు బయల్దేరే వాళ్లంతా ఈ రిపోర్టులను సమర్పించాలని చెప్పారు. హజ్‌ కమిటీ, సంబంధిత సంస్థలతో మీటింగ్ నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

RT-PCR టెస్ట్ చేయించి విమానం ఎక్కడానికి 72గంటల ముందు తేదీతో ఉన్న రిపోర్టును సబ్మిట్ చెయ్యాలని చెప్పారు. కరోనా వైరస్‌ కలకలం రేపుతున్న నేపథ్యంలోనే దీన్ని తప్పనిసరి చేసినట్టు వెల్లడించారు. గతంలో దేశంలోని 21 ప్రాంతాల నుంచి హజ్‌ యాత్ర ప్రారంభం కాగా.. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా దీన్ని 10 ప్రాంతాలకు పరిమితం చేసినట్లు నఖ్వీ వివరించారు. విమానయాన సంస్థల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

Also Read :

ఈ నెలాఖరులో యాసంగి ‘రైతుబంధు’ !

డేరా బాబాకు రహస్యంగా ఒక రోజు పెరోల్

భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్..సర్వదర్శనం టోకెన్ల జారీ కేంద్రాలు పెంపు