ఆళ్లగడ్డ హైవేపై హైటెన్షన్‌ .. రైతులను ఆదుకోవాలంటూ మాజీ మంత్రి అఖిలప్రియ మెరుపు ధర్నా

|

Dec 16, 2020 | 2:21 PM

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ హైవేపై హైటెన్షన్‌ నెలకొంది. రైతులను ఆదుకోవాలంటూ మెరుపు ధర్నా చేశారు మాజీ మంత్రి అఖిలప్రియ. ఎకరానికి 50 వేల పరిహారం...

ఆళ్లగడ్డ హైవేపై హైటెన్షన్‌ .. రైతులను ఆదుకోవాలంటూ మాజీ మంత్రి అఖిలప్రియ మెరుపు ధర్నా
Follow us on

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ హైవేపై హైటెన్షన్‌ నెలకొంది. రైతులను ఆదుకోవాలంటూ మెరుపు ధర్నా చేశారు మాజీ మంత్రి అఖిలప్రియ. ఎకరానికి 50 వేల పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. నివర్‌ తుఫాన్‌తో పంట నష్టపోయిన రైతులందరికీ పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ హైవేపై బైటాయించారు. తన సోదరుడు జగత్‌తోపాటు రైతులతో కలిసి ధర్నా చేశారు అఖిలప్రియ. నిరసనకు అనుమతి లేదని, ట్రాఫిక్‌ జామ్‌ అయిందని, ఆందోళన విరమించాలని అఖిలను కోరారు పోలీసులు. అయినా వారు అక్కడే బైటాయించి నిరసన తెలిపారు. రైతులకు నీళ్లు ఇవ్వకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే ఆళ్లగడ్డలో మళ్లీ పాత ఫ్యాక్షన్ పరిస్థితులు వస్తాయని హెచ్చరించారు అఖిలప్రియ.