చంద్రబాబు తర్వాత టీడీపీ.. జూనియర్ ఎన్టీఆర్ చేతుల్లోకి వెళ్లబోతుందనే వార్తలు ఊపందుకున్నాయి. హరికృష్ణ ఉన్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. అలాగే.. అప్పుడు ఎన్టీఆర్‌కి మంచి పదవి కూడా దక్కబోతోందనే వార్తలు కూడా బాగా వైరల్ అయ్యాయి. మళ్లీ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తాడా..? అనే ఆసక్తికరమైన చర్చ చాలా రోజుల నుంచి జరుగుతోంది.
2019 ఎన్నికల ముందు కూడా.. ఎన్టీఆర్.. పార్టీ కోసం ప్రచారం చేయాలని చంద్రబాబు.. పార్టీ వర్గాలు కోరినా.. అందుకు జూనియర్ నిరాకరించాడని సమాచారం. భవిష్యత్తులో పార్టీకి అవసరమైనప్పుడు నేను తప్పకుండా.. వస్తానంటూ.. ఇప్పటికే పలుమార్లు చెప్తూ వచ్చాడు. దివంగత నందమూరి రామారావు స్థాపించిన పార్టీ కోసం ప్రాణం ఉన్నంత వరకూ కష్టపడుతూనే ఉంటానని గతంలోనే ఎన్టీఆర్ చెప్పాడు.
అయితే.. ఇప్పుడు అసలు విసయం ఏంటంటే.. చంద్రబాబు తర్వాత.. తెలుగుదేశం పార్టీని నిలబెట్టగల సత్తా ఎవరిది అనేది. చంద్రబాబు తనయుడు లోకేష్.. ప్రస్తుత రాజకీయాల్లో వున్నా..! అతనికి అంత శక్తి లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పార్టీ.. మళ్లీ పైకి తీసుకురావాలన్నా.. చంద్రబాబు తర్వాత పార్టీని చూసుకోగల సత్తా జూనియర్ ఎన్టీఆర్‌కి ఉందని అంటున్నారు.. కొందరు నేతలు.. ఎన్టీఆర్ అభిమానులు. కానీ.. ఎన్టీఆర్‌కి కూడా.. అంతగా రాజకీయ అనుభవం లేదు. గడ్డు పరిస్థితిల్లో ఎలాంటి స్టెప్ తీసుకోవాలో తెలీదు. మరి ఆయనికి పార్టీ ఇచ్చినా.. సమర్థవంతంగా నడిపించగలరా..! అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.
కాగా.. ఈ మధ్య లోకేష్ కూడా.. జూ.ఎన్టీఆర్ రాకపై ఓ హాట్ కామెంట్ చేశారు. టీడీపీ ఒకరి సొతు కాదని.. పార్టీ కోసం పనిచేసేవాళ్లు ఉన్నారు. ఎవరైనా వచ్చి పనిచేయొచ్చు.. అందుకు జూనియర్ ఎన్టీఆర్ ఏం మినహాయింపు కాదని చెప్పారు చిన్నబాబు. లోకేష్ మాటలను బట్టి చూస్తే.. ఎన్టీఆర్ వచ్చినా.. పార్టీలో ఏం సమస్యలేదని లేదని.. చెప్పకనే.. చెప్పినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. చూడాలి మరి.. భవిష్యత్తులో టీడీపీ ఎవరి చేతుల్లోకి వెళ్లనుందో..!