కరోనా అప్‌డేట్ : ఏపీలో కొత్తగా 1,916 పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా తీవ్రత తగ్గింది. కొత్తగా 64, 581 శాంపిల్స్ టెస్ట్ చేయగా.. 1,916 పాజిటివ కేసులు నమోదయినట్లు రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది.

కరోనా అప్‌డేట్ : ఏపీలో కొత్తగా 1,916 పాజిటివ్ కేసులు

Updated on: Nov 02, 2020 | 6:20 PM

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా తీవ్రత తగ్గింది. కొత్తగా 64, 581 శాంపిల్స్ టెస్ట్ చేయగా.. 1,916 పాజిటివ కేసులు నమోదయినట్లు రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. ఫలితంగా రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,27,882కి చేరింది. 24 గంటల వ్యవధిలో 13 మంది కరోనా కారణంగా ప్రాణాలు విడిచారు. అనంతపురం జిల్లాలో 3, కృష్ణా 3, చిత్తూరు, తూర్పుగోదావరి, గుంటూరు, కడప, ప్రకాశం, శ్రీకాకుళం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒకరు చొప్పున మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా మృతుల సంఖ్య 6,719కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 3,033 మంది కొవిడ్‌ నుంచి పూర్తిగా కోలుకోగా..ప్రస్తుతం రాష్ట్రంలో 22,538 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 81,82,266 శాంపిల్స్ పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది.

Also Read :

క్రికెట్‌కు షేన్ వాట్సన్‌ గుడ్ ‌బై !

సౌండ్ పెంచితే సీజ్!